ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా అధికం: కేంద్ర ఆరోగ్య శాఖ

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రోజూ దాదాపు 70వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా అధికం: కేంద్ర ఆరోగ్య శాఖ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 01, 2020 | 6:59 PM

Coronavirus India Updates: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రోజూ దాదాపు 70వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజల్లోనూ ఆందోళన పెరుగుతోంది. కాగా ఐదు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే ఈ ఐదు రాష్ట్రాల్లో మరణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

అయితే దేశవ్యాప్తంగా కోలుకుంటున్న వారిలో 58శాతం మంది ఆ రాష్ట్రాల్లోనే ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశంలో ఇప్పటివరకు 36,91,166 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 28,39,882 మంది కోలుకున్నారు. 65,288 మంది కరోనా సోకి మరణించారు.

Read More:

 దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

ఈసారి ‘షించాన్’ పేరు.. కేసు నమోదు