భార్యను చంపి ఆవు పేడలో శవాన్ని దాచిన భర్త..

కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మాంత్రికుని సహాయంతో మృతదేహాన్ని ఆవు పేడతో కప్పి తిరిగి బతికించుకునేందుకు సాహసించాడు ఆ పైశాచిక ప్రబుద్దుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్న నానుడి నమ్మి కట్టుకున్న ఆలినే కాటికి పంపాడు.

భార్యను చంపి ఆవు పేడలో శవాన్ని దాచిన భర్త..
Follow us
Balu

|

Updated on: Sep 01, 2020 | 7:01 PM

కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మాంత్రికుని సహాయంతో మృతదేహాన్ని ఆవు పేడతో కప్పి తిరిగి బతికించుకునేందుకు సాహసించాడు ఆ పైశాచిక ప్రబుద్దుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్న నానుడి నమ్మి కట్టుకున్న ఆలినే కాటికి పంపాడు.

బేతుల్‌ జిల్లాలోని చిచోలి గ్రామానికి చెందిన భైయలాల్‌(46), ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు . భైయలాల్‌ మద్యానికి బానిసై భర్తతో తరుచు గొడవ పడుతున్నాడు. దీంతో అతని ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులను వదిలి వేరే చోట నివసిస్తున్నారు. ఇదే క్రమంలో ఆగష్టు 26న తాగి వచ్చిన భైయలాల్‌ తన భార్యతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో చెక్క కర్రతో ఆమె తలపై గట్టిగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలింది. అయితే, చనిపోయిన తన భార్యను మళ్లీ బతికించుకోవచ్చని ఓ మాంత్రికుడు చెప్పడంతో అతని సలహా మేరకు ఆమె శరీరాన్ని ఆవు పేడతో కప్పి రెండు రోజులపాటు క్షుద్రపూజలు నిర్వహించేందుకు ఫ్లాన్ చేశాడు. ఈ లోపు నిందితుడి ఇంటికి మాంత్రికుడు చేరుకోకముందే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆగష్టు 28న పాక్షికంగా కుళ్లిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిచోలీ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మాంత్రికుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చిచోలి పీఎస్‌ ఇంచార్జి దీపక్‌ పరాషర్‌ తెలిపారు.