Bomb Threat to Schools: చెన్నైలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. పాఠశాలలు మూత

|

Feb 08, 2024 | 3:33 PM

తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు స్కూళ్లకు గురువారం (ఫిబ్రవరి 8) బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. చెన్నై నగరంలోని మొత్తం ఐదు పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సంబంధిత స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థులు, సిబ్బందిని తక్షణమే ఇళ్లకు పంపించారు. అనంతరం ఆయా..

Bomb Threat to Schools: చెన్నైలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. పాఠశాలలు మూత
Bomb Threat To Schools
Follow us on

చెన్నై, ఫిబ్రవరి 8: తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు స్కూళ్లకు గురువారం (ఫిబ్రవరి 8) బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. చెన్నై నగరంలోని మొత్తం ఐదు పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సంబంధిత స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థులు, సిబ్బందిని తక్షణమే ఇళ్లకు పంపించారు. అనంతరం ఆయా పాఠశాలలను మూసివేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాఠశాలలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు.

జేజే నగర్‌, ఆర్‌ఏ పురం, అన్నానగర్, గోపాలపురం, పరిముణా ప్రాంతాల్లోని 5 ప్రైవేట్‌ స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. తల్లిదండ్రులతో విద్యార్థులను తరలించిన అనంతరం బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు సంబంధిత స్కూళ్లలో లభ్యంకాలేదని పోలీసులు తెలిపారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, ఈమెయిల్స్ పంపిన నిందితుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపు మెయిల్ పంపిన పాఠశాలల్లో డీఏవీ గోపాలపురంలోని చెన్నై పబ్లిక్ స్కూల్, ప్యారీస్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్ కూడా ఉన్నాయి.

కాగా ఇటీవల బెంగళూరులోనూ పలు పాఠశాలలకు ఇదే మాదిరి బాంబ్‌ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. గత యేడాది డిసెంబరులో ఒకే రోజు ఏకంగా 68 పాఠశాలలను బాంబు బెదిరింపు ఈమెయిల్‌ పంపించారు. పోలీసులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అవి నకిలీ బెదిరింపులని పోలీసులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.