కరోనా.. క్లినికల్ ట్రయల్స్ కోసం 5 ఆసుపత్రుల ఎంపిక

| Edited By: Anil kumar poka

May 09, 2020 | 12:36 PM

కరోనా వ్యాధి చికిత్స లో వినియోగిస్తున్న రెమ్ డెసివిర్ మందును మరింత నాణ్యమైనదిగా తయారు చేసేందుకు, మరికొన్ని మందుల కాంబినేషన్ తో పవర్ ఫుల్ మెడిసిన్ గా అభివృధ్ది చేసేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం...

కరోనా.. క్లినికల్ ట్రయల్స్ కోసం 5 ఆసుపత్రుల ఎంపిక
Follow us on

కరోనా వ్యాధి చికిత్స లో వినియోగిస్తున్న రెమ్ డెసివిర్ మందును మరింత నాణ్యమైనదిగా తయారు చేసేందుకు, మరికొన్ని మందుల కాంబినేషన్ తో పవర్ ఫుల్ మెడిసిన్ గా అభివృధ్ది చేసేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం దేశంలో ఐదు ఆసుపత్రులను ఎంపిక చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాలిడారిటీ ట్రయల్ కింద వీటిని సెలెక్ట్ చేసినట్టు వైద్యవర్గాలు వెల్లడించాయి. వీటిలో నాలుగు ఆసుపత్రులకు అప్పుడే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది. వీటిలో  అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజ్ అండ్ సివిల్ హాస్పిటల్, జోధ్ పూర్ లోని ఎయిమ్స్, చెన్నై లోని  అపోలో ఆసుపత్రి ఉన్నాయి. ఇవి రెమ్ డెసివిర్, లోపినవిర్, రిటనోవిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్. ఇంటర్ ఫెరాన్  బెటా కాంబినేషన్ లో ఉన్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాధి చికిత్సకు అవసరమయ్యే వ్యాక్సీన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.. ముఖ్యంగా ఇతర మెడిసిన్స్ తో కలిపి రెమ్ డెసివిర్ మందును అత్యంత శక్తిమంతమైనదిగా తయారు చేస్తున్నారు.

అన్ని ట్రయల్స్ కు తమకు కనీసం 1500 మంది రోగులు అవసరమవుతారని ఎపిడెర్మాలజీ  డివిజన్ హెడ్ డాక్టర్ షీలా గాడ్ బోలె తెలిపారు. రోగుల పేర్లను నమోదు చేసుకోవడం ప్రారంభించామన్నారు. ఏ రోగి అయినా సైడ్ ఎఫెక్ట్స్ కి గురైన పక్షంలో అతనికి ట్రయల్స్ నిర్వహించడం నిలిపివేస్తామని ఆమె చెప్పారు