AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌కు ‘కరోనా’ అప్పుడే వచ్చిందట… కానీ అది వైరస్ కాదట..

మహమ్మారి కరోనా వైరస్‌ ఎలా పుట్టిందో ఏమో కానీ.. ప్రజలను చంపేస్తోంది.. ప్రపంచాన్ని వణికిస్తోంది.. మానవాళిని గడగడలాడిస్తోంది.. ఆ ప్రమాదకరమైన వైరస్‌కు కరోనా అని పేరు ఎందుకు పెట్టారో కానీ.. అప్పుడెప్పుడో ఆ పేరిట ఉన్నవి మాత్రం ఇప్పుడు పాపులర్‌ అవుతున్నాయి. ఈ జనరేషన్‌కు తెలియదేమో కానీ.. ఇంతకు ముందు కరోనా పేరుతో ఓ చెప్పుల కంపెనీ ఉండేది.. బాటా అంత ఫేమస్‌ కాకపోయినా… కరోనా చెప్పులకు కూడా క్రేజ్‌ ఉండేది అప్పట్లో… ఆ విషయం వదిలేస్తే […]

గుజరాత్‌కు 'కరోనా' అప్పుడే వచ్చిందట... కానీ అది వైరస్ కాదట..
Ravi Kiran
|

Updated on: May 09, 2020 | 12:08 PM

Share

మహమ్మారి కరోనా వైరస్‌ ఎలా పుట్టిందో ఏమో కానీ.. ప్రజలను చంపేస్తోంది.. ప్రపంచాన్ని వణికిస్తోంది.. మానవాళిని గడగడలాడిస్తోంది.. ఆ ప్రమాదకరమైన వైరస్‌కు కరోనా అని పేరు ఎందుకు పెట్టారో కానీ.. అప్పుడెప్పుడో ఆ పేరిట ఉన్నవి మాత్రం ఇప్పుడు పాపులర్‌ అవుతున్నాయి. ఈ జనరేషన్‌కు తెలియదేమో కానీ.. ఇంతకు ముందు కరోనా పేరుతో ఓ చెప్పుల కంపెనీ ఉండేది.. బాటా అంత ఫేమస్‌ కాకపోయినా… కరోనా చెప్పులకు కూడా క్రేజ్‌ ఉండేది అప్పట్లో… ఆ విషయం వదిలేస్తే గుజరాత్‌లో 2015లో కరోనా పేరుతో ఓ హోటల్‌ ప్రారంభమయ్యింది.. ఇప్పుడా హోటల్‌ హాట్‌టాపిక్‌గా మారింది.. గుజరాత్‌, రాజస్తాన్‌ సరిహద్దులో బనస్కాంత హైవే పక్కన ఉంది ఈ హోటల్‌.. ఇప్పుడా హైవే మీదుగా వెళుతున్నవారు ఈ హోటల్‌పై ఓ నజర్‌ వేస్తున్నారు.. మరీ ఆసక్తి ఉన్నవారు హోటల్‌ ముందర ఓ సెల్ఫీ దిగుతున్నారు. సోషల్‌మీడియాలో షేర్‌ చేసుకుని ముచ్చటపడుతున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడా హోటల్ మూతపడింది కానీ.. కరోనా వైరస్‌ తాకిడి లేనంత వరకు కరోనా హోటల్‌ బ్రహ్మండంగా నడిచింది.. చాలా మంది ఆ హోటల్‌లో బస చేసేవారు..ఈ హోటల్‌ యజమాని గుజరాత్‌ సిద్ధాపూర్‌కు చెందిన బర్కత్‌. అయిదేళ్ల కిందట ఈ హోటల్‌ను ప్రారంభించారాయన. హోటల్‌కు ఏం పేరు పెడదామా అని తెగ ఆలోచించాడట.. చివరాఖరికి కరోనా అనే పేరు తట్టిందట.. ఇంతకీ కరోనా అంటే ఉర్దూలో గెలాక్సీ అని అర్థం.. అంటే పాలపుంత అన్నమాట.. ఇంత అందమైన పేరు ప్రాణాంతక మహమ్మారికి పెట్టడమేమిటో… పాపం బర్కత్‌ కూడా ఇప్పుడు ఫీలవుతున్నారు.. కరోనా మానవాళిపై ఇంతగా పగపడుతుందని తాను అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..అయినప్పటికీ తన హోటల్‌కు అయిదేళ్ల కిందటే కరోనా అని పేరు పెట్టడం కాసింత గర్వంగానే ఉందంటున్నారు.. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు అరకొర మంది హైవే మీదుగా వెళుతున్నారని.. వారు కూడా కరోనా పేరిట ఉన్న ఈ హోటల్‌ను చూసి ఆశ్చర్యపడుతున్నారని బర్కత్‌ చెప్పుకొచ్చారు.

Read More:

గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!