డ్రగ్స్ కేసులో రియాచక్రవర్తికి బెయిల్ లభించింది. అయితే అయిదు షరతులతో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ పది రోజులపాటు ముంబై పోలీసుల ఎదుట హాజరు కావాలని, పాస్ పోర్టును స్వాధీనం చేయాలనీ.., లక్ష రూపాయలకు బెయిల్ బాండును సమర్పించాలని ఆదేశించింది. పైగా దేశాన్ని వదిలి వెళ్లరాదని, మరే ఇతర సాక్షిని కూడా కలుసుకోరాదని సూచించింది. ఇందుకు రియా మౌనంగా అంగీకరించింది.