ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ షూ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు గల్లంతయ్యారు. పశ్చిమ ఢిల్లీలోని ఉద్యోగనగర్ లో గల ఆపేక్ష ఇంటర్నేషనల్ వేర్ హౌస్ లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఆర్పేందుకు మొదట 24 ఫైరింజన్లను తెప్పించారు. అయినప్పటికీ అవి అదుపులోకి రాకపోవడంతో.. మరో 15 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. దట్టమైన పొగలు, మంటలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదానికి సంబందించి తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆరుగురి ఆచూకీ తెలియడంలేదన్నారు. ఈ ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని..బహుశా షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చునని భావిస్తున్నామని వారు చెప్పారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. నగరంలో ఉష్ణోగ్రత పెరిగిపోవడం కూడా స్థానికులకు ఆందోళన కల్గిస్తోంది. అటు- పలు ఫ్లోర్స్ ఉన్న ఈ ఆపేక్ష ఇంటర్నేషనల్ వేర్ హౌస్ లో ఏ అంతస్థు నుంచి మంటలు రేగాయన్నది కూడా తెలియాల్సి ఉంది.
ఇలా ఉండగా నిన్న కూడా ఢిల్లీలోని మంగోలిపురా ప్రాంతంలో సిలిండర్ పేలిన కారణంగా 13 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: మూడంతస్తులు ఎక్కొచ్చి బెడ్ పై సీదతీరుతున్న ఎద్దు వైరల్ అవుతున్న వీడియో :Bull king climbed into 3-storey house video viral.
నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్లరి.. అందరూ ఫిదా: viral video.