Viral: బ్యాంకుకు వచ్చి గాల్లోకి కాల్పులు జరిపాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వామ్మో వీడియో చూడండి..

రెయిన్ కోట్ ధరించాడు.. మొహం కనిపించకుండా మాస్క్ వేశాడు.. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించాడు.. చూస్తుండగానే కాల్పులు జరిపి రూ.7లక్షలు దోచుకెళ్లాడు.. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది.. ఇండోర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో సినీఫక్కీలో దోపిడీకి పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది..

Viral: బ్యాంకుకు వచ్చి గాల్లోకి కాల్పులు జరిపాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వామ్మో వీడియో చూడండి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 17, 2024 | 11:57 AM

రెయిన్ కోట్ ధరించాడు.. మొహం కనిపించకుండా మాస్క్ వేశాడు.. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించాడు.. చూస్తుండగానే కాల్పులు జరిపి రూ.7లక్షలు దోచుకెళ్లాడు.. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది.. ఇండోర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో సినీఫక్కీలో దోపిడీకి పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.. ఓ దుండగుడు బ్యాంకులోనే కాల్పులు జరిపి క్యాషియర్‌ నుంచి రూ.7 లక్షలు దోచుకెళ్లాడు. పట్టపగలు పిఎన్‌బి, విజయ్‌నగర్‌ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై ఉన్న సీసీటీవీలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.. దుండగుడు.. తుపాకీ పట్టుకుని బ్యాంకు లోపలికి వెళ్లాడు.. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యాహ్నం వేళ 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగుడు తన బైక్‌ను బ్యాంక్ ముందు పార్క్ చేసి, తుపాకీతో బ్యాంక్‌లోకి ప్రవేశించాడు.. ఈ ఘటన జరిగిన సమయంలో బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు.

దోపిడీ సమయంలో అనుమానితుడు గాలిలోకి కాల్పులు జరపడంతో సిబ్బంది.. కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే.. ఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు తన బ్యాగ్‌లో డబ్బుతో నింపాలని క్యాషియర్‌ నుదిటిపై గన్ పెట్టి డిమాండ్ చేశాడు.. అనంతరం డబ్బులతో ఉడాయించాడని పోలీసులు తెలిపారు. దుండగుడికి సహాయంగా మరొకరు బ్యాంకు వెలుపల వేచి ఉన్నాడని కూడా పోలీసులు పేర్కొన్నారు. దోపిడీ అనంతరం వారిద్దరూ మోటార్‌సైకిల్‌పై అక్కడి నుంచి పరారయ్యారు.

వీడియో చూడండి..

నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది లేదా సెక్యూరిటీ గార్డు అయి ఉండవచ్చునని.. ఆయుధాలు కలిగి ఉండటం, దోపిడీ చేసిన తీరును బట్టి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి సాక్షులను విచారిస్తున్నారు.

ఈ సంఘటన బ్యాంకు వద్ద ఉన్న భద్రతా చర్యల గురించి ప్రశ్నలు మొదలయ్యాయి. స్థానిక నివాసితులు, బ్యాంకు ఖాతాదారులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కాగా.. నిందితులను పట్టుకునేందుకు బ్యాంకు, పరిసర ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అదనపు పోలీస్ కమిషనర్ అమిత్ సింగ్, డీసీపీ జోన్ 2 అభినవ్ విశ్వకర్మ, డీసీపీ క్రైమ్ బ్రాంచ్ ఇండోర్ రాజేష్ దండోటియా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..