Fertility Rate Drop: దేశంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ఐదవ రౌండ్ ప్రకారం.. మొత్తం సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate) 2.2 నుంచి 2.0 శాతానికి క్షీణించినట్లు తెలింది. సర్వేల ప్రారంభమైన 1992-93 నుంచి ఈ నిష్పత్తి 3.4 నుంచి 2.0కి అంటే 40% పైగా పడిపోవటం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ప్రస్తుతం జనాభాను స్థిరంగా ఉంచడానికి తగినంత మంది పిల్లలు పుట్టే స్థాయి అంటే భర్తీ స్థాయి కంటే తక్కువకు ఈ రేటు చేరుకుంది.
దేశంలో కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే 2.1 పిల్లల సంతానోత్పత్తి స్థాయికి మించి TFRని కలిగి ఉన్నాయి. వాటిలో బీహార్ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) రాష్ట్రాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా అధిక సంతానోత్పత్తి రేట్లు ఉన్న సమూహాలు వేగంగా క్షీణించినట్లు ఈ సర్వే డేటా చూపుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 లో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.62 నుంచి.. తాజా సర్వే సమయానికి 9.9% క్షీణించి 2.36కి పరిమితమైంది. ముస్లింలు కాకుండా అన్ని ప్రధాన మతాల్లో ఇప్పుడు భర్తీ స్థాయి కంటే తక్కువ ఫెర్టిలిటీ రేటు కలిగి ఉన్నాయని ఈ సర్వే తేటతెల్లం చేసింది.
అయితే.. వివిధ కమ్యూనిటీలు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఫెర్టిలిటీ రేటును కలిగి ఉన్నాయి. UPలో హిందువులు 2.29 ఫెర్టిలిటీ రేటు కలిగి ఉన్నారు. కానీ.. తమిళనాడులో ఈ కమ్యూనిటీ ఫెర్టిలిటీ రేటు 1.75; అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ముస్లిం ఫెర్టిలిటీ రేటు 2.66 ఉండగా.. అది తమిళనాడులో 1.93గా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని మహిళల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సగటు ఫెర్టిలిటీ రేటు కలిగి ఉన్నారు. బీహార్, మేఘాలయాలు దేశంలో అత్యధిక సంతానోత్పత్తి రేట్లు కలిగి ఉండగా.. సిక్కిం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు అత్యల్ప ఫెర్టిలిటీ రేటు కలిగి ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి..
Mahbubnagar Attack: దారుణం.. వంట పాత్రలు కడగమన్నందుకు తల్లిపై కూతురు కర్కశత్వం.. గొంతు కోసి..