Fearing Lockdown : లాక్‌డౌన్ భయంతో సొంతూళ్లకు పయనమవుతున్న వలస కార్మికులు.

Fearing Lockdown : సరిగ్గా సంవత్సరం కిందట మనం అనుభవించిన దుర్భర పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతాయేమోనన్న భయాందోళనలు కలుగుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది.

Fearing Lockdown : లాక్‌డౌన్ భయంతో సొంతూళ్లకు పయనమవుతున్న వలస కార్మికులు.
Fearing Lockdown
Follow us

|

Updated on: Apr 14, 2021 | 1:54 PM

Fearing Lockdown : సరిగ్గా సంవత్సరం కిందట మనం అనుభవించిన దుర్భర పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతాయేమోనన్న భయాందోళనలు కలుగుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. లక్షకు పైగా కేసులు నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. కోవిడ్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్‌ను విధించబోదని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్‌ స్పష్టం చేసినప్పటికీ ప్రజలకు ఏదో ఒక మూల లాక్‌డౌన్‌ భయం మాత్రం వెన్నాడుతోంది. ఆర్ధికవ్యవస్థను సంక్షోభంలోకి నెట్టడానికి ఏ ప్రభుత్వమూ పూనుకోదు. అందుకోసమే మహారాష్ట్ర, కర్నాటక మొదలైన రాష్ట్రాలలో 144 సెక్షన్‌తో పాటు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఓ రకంగా సెమీ లాక్‌డౌన్‌ అనుకోవచ్చు. అక్కడ అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాంపునిచ్చారు. కరోనాతో మరోసారి యుద్ధం మొదలుపెట్టామని, లాక్‌డౌన్‌ కాకుండా బ్రేక్‌ ద చైన్‌ పేరుతో ఆంక్షలను అమలు చేస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే చెప్పారు. ఆంక్షలతో ఇబ్బందిపడే రంగాల వారికి, పేదలకు సాయం అందజేస్తామన్నారు. లాక్‌డౌన్‌ను విధించబోమని ప్రభుత్వాలు చెబుతున్నా వలస కార్మికులకు అనుమానం పోవడం లేదు.. క్రితం సంవత్సరం కార్మికులు చాలా కష్టాలు పడ్డారు. కాలినకడన మైళ్ల కొద్దీ నడిచి సొంతూళ్లకు వెళ్లారు. ఇప్పుడు ముందు జాగ్రత్తగా సొంతూళ్లకు పయనమవుతున్నారు. అందుకే రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.

Fearing Lockdown,Fearing Lockdown,Lockdown,Some Migrant Workers,Migrant Workers Begin Leaving,Migrant Workers,Migrant Workers Leaving with Fearing Lockdown

హైదరాబాద్‌లోని కోంపల్లి ప్రాంతంలో పనిచేస్తున్న మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాకు చెందిన పలువురు భవన నిర్మాణ కార్మికులు తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. నిరుడు లాక్‌డౌన్‌ సమయంలో ఎదురైన అనుభవాలను తల్చుకుంటూనే భయం వేస్తున్నదని, రైళ్లు, బస్సులు నడవకపోవడంతో ఎన్నో అగచాట్లు పడ్డామని చెబుతున్నారు. తినడానికి తిండిలేక మండు వేసవిలో కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లామని, మళ్లీ ఆ కష్టాలు పడటం ఎందుకన్న ఉద్దేశంతోనే మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతున్నామని చెబుతున్నారు.మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో అక్కడున్న వలస కార్మికులు సొంతూళ్ల బాట పట్టారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి మ‌హారాష్ర్ట‌కు పని కోసం వచ్చిన 80 వేల మంది కార్మికులు త‌మ సొంత ఊళ్లకు చేరుకున్నారు. మూడు రోజుల నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గోర‌ఖ్‌పూర్‌, వార‌ణాసి, ప్ర‌యాగ్‌రాజ్‌, ల‌క్నో వెళ్లే రైళ్లలో అయితే కిక్కిరిసిపోతున్నాయి. సొంతూళ్లలో ఉన్నపాటి డబ్బుతోనే బతుకుతామని అంటున్నారు. నిరుడు ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా లాక్‌డౌన్‌ను విధించాయి ప్రభుత్వాలు.. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కార్మికుల ఉపాధి పోయింది. కాలినడకన సొంత ఊళ్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పుడు పరిస్థితి అలా ఉండింది. ఇప్పుడలా లేదు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌ నుంచి గుజరాత్‌కు వచ్చిన వలస కార్మికులు కూడా స్వగ్రామలకు బయలుదేరారు. అందుకే అహ్మదాబాద్‌లోని కలుపూర్‌ రైల్వేస్టేషన్, సూరత్‌లోని ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. మరిన్ని చదవండి ఇక్కడ : కరోనా కేసులు పెరుగుతుంటే సభ ఎలా పెడతారు ? TRS పై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు వీడియో..:Congress vs TRS video. కరోనా వైరస్ శవ జాగారం..కరోనా మరణాలతో రద్దీగా మార్చురీలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి!: covid19 Live Video.