AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omar Abdullah: జమ్మూకశ్మీర్‌ సీఎం ఎవరో చెప్పేసిన ఫరూక్ అబ్దుల్లా..!

Jammu Kashmir Assembly Election Results: మంగళవారం నాటి ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన తర్వాత జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు ఒమర్ అవుతారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నాడు.

Omar Abdullah: జమ్మూకశ్మీర్‌ సీఎం ఎవరో చెప్పేసిన ఫరూక్ అబ్దుల్లా..!
Omar Abdullah Will Be Chief
Velpula Bharath Rao
|

Updated on: Oct 08, 2024 | 3:10 PM

Share

మంగళవారం నాటి ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన తర్వాత జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు ఒమర్ అవుతారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ప్రజలు తమ తీర్పునిచ్చారని.. ఆగస్టు 5న (ఆర్టికల్ 370 రద్దు) తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని నిరూపించారని.. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

ఒమర్ అబ్దుల్లా బుద్గాం, గందర్‌బల్ అనే రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఒమర్ బుద్గామ్ స్థానానికి 18,485 ఓట్ల తేడాతో గెలుపొందగా, 15 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి గందర్‌బల్‌లో 9,766 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. మొదట్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు చూపించిన తర్వాత ఒమర్ అబ్దుల్లా ఎగ్జిట్ పోల్స్‌పై సెటైర్ వేశారు. ఎగ్జిట్ పోల్స్‌ హంగ్ అసెంబ్లీని అంచనా వేసిందని, అందుకే తాను వాటిని టైమ్ వేస్ట్ అని చెబుతూ ఉంటానని ట్వీట్ చేశారు. ఒక దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని హైలైట్ చేస్తూ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 90 స్థానాలకు గానూ 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, సగం మార్కును సునాయాసంగా అధిగమించింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కించుకోవచ్చని ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

Follow Us
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్