AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేడి వేడి అన్నంలోకి బీరకాయ తొక్కల పచ్చడి.. రుచి అదిరిపోతుంది.. సింపుల్‌గా ఇలా చేసేయండి!

బీరకాయ కూర వండేటప్పుడు చాలామంది వాటి తొక్కలను పనికిరావు అనుకుని చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ, ఆ తొక్కలతో అద్భుతమైన, రుచికరమైన పచ్చడి తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది జీరో-వేస్ట్ కుకింగ్ కి చక్కటి ఉదాహరణగా నిలవడమే కాకుండా, పోషకాలతో కూడుకున్నది. శనగపప్పు, మినపప్పు, పల్లీలు, వెల్లుల్లి, బీరకాయ తొక్కలను ఉపయోగించి ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేయవచ్చు. కొద్దిగా చింతపండు, బెల్లం జోడించడం వల్ల ఈ పచ్చడికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. వేడి వేడి అన్నం, రోటీ లేదా ఇడ్లీ, దోసెల్లోకి ఇది నూటికి నూరుపాళ్లు అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ తెలిశాక మీరు ఎప్పుడూ బీరకాయ తొక్కలను బయటపడేయరు.

వేడి వేడి అన్నంలోకి బీరకాయ తొక్కల పచ్చడి.. రుచి అదిరిపోతుంది.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
Ridge Gourd Peel Chutney
Jyothi Gadda
|

Updated on: Nov 15, 2026 | 7:30 AM

Share

ఇళ్లలో బీరకాయ కూర వండేటప్పుడు చాలామంది దాని పైభాగం తొక్కను చెత్తగా భావించి పడేస్తుంటారు. కానీ, ఆ తొక్కలతోనే ఎంతో రుచికరమైన, నోరూరించే చట్నీ తయారు చేసుకోవచ్చని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది కేవలం ఆహార వ్యర్థాలను తగ్గించే జీరో-వేస్ట్ కిచెన్ పద్ధతే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పల్లీలు, పప్పు దినుసులు, మసాలాలతో కలిపి చేసే ఈ బీరకాయ తొక్కల పచ్చడి భోజనానికి అద్భుతమైన రుచిని ఇస్తుంది. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే, ఇకపై ఎప్పుడూ బీరకాయ తొక్కలను వేస్ట్ చేయరు.

కావలసిన పదార్థాలు:

బీరకాయ తొక్కలు – ఒక కప్పు (సన్నగా తరిగినవి)

ఇవి కూడా చదవండి

పల్లీలు – 2 స్పూన్లు

శనగపప్పు – 2 స్పూన్లు

మినపప్పు – 1 స్పూన్

ధనియాలు – 1 స్పూన్

జీలకర్ర – అర స్పూన్

ఎండుమిర్చి – 4 నుండి 5

వెల్లుల్లి రెబ్బలు – 4

టమోటా – 1 (సన్నగా తరిగినది)

చింతపండు గుజ్జు – చిన్న నిమ్మకాయ సైజు అంత

బెల్లం – కొద్దిగా

ఉప్పు, పసుపు – తగినంత

తాలింపు కోసం: ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు

తయారీ విధానం:

మొదటగా బీరకాయలను శుభ్రంగా కడిగి, వాటి తొక్కలను సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేడి చేసి, చిటికెడు ఇంగువ వేయాలి. అందులో పల్లీలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు వేసి సన్నని మంటపై మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేయాలి. రుచి కోసం కొన్ని కరివేపాకులు కూడా జోడించవచ్చు.

ఇప్పుడు అదే బాణలిలో తరిగి పెట్టుకున్న బీరకాయ తొక్కలను వేసి కొన్ని నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత తరిగిన టమోటా ముక్కలు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. మిశ్రమం మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించాలి. చివరగా కొద్దిగా చింతపండు గుజ్జు మరియు బెల్లం ముక్కను జోడించి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

చివరగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెడితే ఘుమఘుమలాడే బీరకాయ తొక్కల పచ్చడి సిద్ధం. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి లేదా టిఫిన్లలోకి ఇది అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us