Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలపై కొనసాగుతున్న ఆంక్షలు.. మళ్లీ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు
గణతంత్ర దినోత్సవం నాటి నుంచి సింఘు, టిక్రి, ఘాజీపూర్, టిక్రీ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..
Farmers Protest – internet ban : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా రైతుల ఆందోళన కొనసాగుతూన్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం నాటి నుంచి సింఘు, టిక్రి, ఘాజీపూర్, టిక్రీ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం జనవరి 29 నుంచి 31 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఆ సేవలను మరో రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017)లోని రూల్ 2లోని సబ్-రూల్ 1 కింద తమకున్న హక్కులు, ప్రజాభద్రత, పబ్లిక్ ఎమర్జెన్సీ నిరోధించేందుకు సింఘు, టిక్రి, ఘాజీపుర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఫిబ్రవరి 2 రాత్రి 11 గంటల వరకూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read:
Metro Neo:మెట్రోలైట్ స్థానంలో చౌకైన ‘మెట్రో నియో’.. మొదటిసారిగా ఢిల్లీలో పరుగులు.. ఎలా ఉంటుందంటే..?