సుప్రీంకోర్టు కమిటీతో రైతు సంఘాల భేటీ 29కి వాయిదా, అల్లర్ల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలే కారణమట.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీతో రైతు సంఘాలు బుధవారం సమావేశం కావలసి ఉంది. అయితే నిన్న ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా ట్రాఫిక్..
Farmers Tractor Rally:సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీతో రైతు సంఘాలు బుధవారం సమావేశం కావలసి ఉంది. అయితే నిన్న ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండడంతో ఈ సమావేశాన్ని ఈ నెల 29 కి వాయిదా వేశారు. ఈ పానెల్ ఈ నెల 21 న 8 రాష్ట్రాలకు చెందిన రైతులతో తొలి సమావేశం నిర్వహించింది. ఆ భేటీ ఏ విషయమూ తేల్చకుండానే ముగిసింది. అటు నలుగురు సభ్యులతో కోర్టు ఏర్పాటు చేసిన పానెల్ నుంచి మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ వైదొలగిన సంగతి తెలిసిందే. తానూ రైతునేనని, వారి ప్రయోజనాలకు మద్దతు తెలుపుతూ ఈ పానెల్ నుంచి వైదొలగుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కమిటీలో అశోక్ గులాటీ, ప్రమోద్ కుమార్ జోషీ, అనిల్ ఘన్వత్ సభ్యులుగా ఉన్నారు. తాము ఏ పార్టీకి గానీ, ప్రభుత్వ సంస్థకు గానీ చెందినవారం కామని ప్రమోద్ కుమార్ జోషీ స్పష్టం చేశారు.