Budget Session 2021: కరోనా నిబంధనలను పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఈరోజు ఉదయం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఓ కరోనా మహ్మమారిపై అనంతరం బర్డ్ ఫ్లూ పై భారత పోరాటం..

Budget Session 2021: కరోనా నిబంధనలను పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
Follow us

|

Updated on: Jan 29, 2021 | 12:38 PM

Parliament Budget Session 2021కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఈరోజు ఉదయం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఓ కరోనా మహ్మమారిపై అనంతరం బర్డ్ ఫ్లూ పై భారత పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు రాష్ట్రపతి. ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ అభివృద్ధి ప్రస్థానాన్నిఅడ్డుకోలేదన్నారు కోవింద్‌. అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసిందని చెప్పారు.

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి స్వయం సమృద్ధి సాధించడమనేది ఒక స్వప్నమని.. అయితే కరోనా తెచ్చిన సంక్షోభం ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేశాం. సమస్య ఎదైనా భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ప్రపంచ దేశాలకు తెలిజేశమన్నారు. ఒకే దేశం ఒకే రేషన్ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది. దేశంలో రెండు టీకాలను రూపొందించాం. అనేక దేశాలకు లక్షల డోసులను సరఫరా చేశాం. సంక్షోభం సమయంలో పొరుగుదేశాలతో కలిసి సాగుతున్నాం. దేశ ప్రజలందరి జీవన స్థితిగతుల ఉన్నతికి ఆత్మనిర్భర్‌ భారత్‌ బాటలు వేసింది అని రాష్ట్రపతి తెలిపారు. దేశ రైతుల సంక్షేమం కోసమే నూతన సాగు చట్టాలను తీసుకొచ్చాం. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉపయోగమని.. కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయి. విస్తృత చర్చల తర్వాతే కొత్త చట్టాలను పార్లమెంట్‌ ఆమోదించిందని చెప్పారు. కొత్త చట్టాలతో రైతులకు విస్తృత అవకాశాలు.. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. ఈ చట్టాలతో 10 లక్షల మంది రైతులకు తక్షణ ఉపయోగమని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగనుణంగా మద్దతు ధరలను పెంచుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాగు చట్టాలపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యం. ఇందుకోసం అనేక పథకాలు తీసుకొచ్చాం. కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రూ. లక్షా 13వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశాం. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించాం. మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ. 20వేల కోట్లను ఖర్చు చేయనున్నాం. చిన్న, సన్నకారు రైతులపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అని రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి కోవింద్ చెప్పారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు:

*ఎన్నో సవాళ్ల మధ్య ఈరోజు జరుపుకుంటున్న ఈ సమావేశాలు భారత చరిత్రలో ఇవాళ ఎంతో ప్రత్యేకం. ఈ సమావేశాలతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాం. స్వాంతంత్య్రం వచ్చి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. *తుపాన్ల నుంచి బర్డ్‌ ఫ్లూ వరకు భారత్‌కు ఎన్నో సవాళ్ల ఎదురయ్యాయి. అయితే ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొందని చెప్పారు. రాష్ట్రపతి * కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసింది. లక్షల మంది విలువైన ప్రాణాలను కరోనా బలితీసుకుంది. ప్రణబ్‌ ముఖర్జీ తోపాటు మరో ఆరుగురు ఎంపీలు మనల్ని విడిచి వెళ్లారు. వారందరికి నివాళులు అర్పిస్తున్నాం. * కరోనాపై భారత పోరాటం స్ఫూర్తిదాయం. పూర్తి శక్తిసామర్థ్యాలతో వైరస్‌ను ఎదుర్కొంది. సమయానుకూల నిర్ణయాలతో మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసింది. లక్షలమంది పౌరుల ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టడం సంతృప్తినిచ్చింది. *దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. *సమయానుకూల చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగాం. *మానవత్వంతో దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా అవుతున్నాయి *దేశవ్యాప్తంగా 24వేల ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. *ఆరేళ్ల కాలంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయి. *దేశవ్యాప్తంగా 7000 కేంద్రాల్లో పేదలు చాలా తక్కువ ఖర్చుతో మందులు పొందుతున్నారు. *దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌లు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. *దేశంలోని 24,000 ఆసుపత్రులలో ఆయుష్మాన్ భారత్ యోజన సౌకర్యాలను పొందవచ్చు. *కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైంది. *దేశంలోకి విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. *జన్‌ధన్‌ యోజన ద్వారా నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం. *ఆరు రాష్ట్రాల్లో గ్రామీణ్‌ కల్యాణ్‌ యోజన అమలు చేశాం. *14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. *గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ లో జరిగిన ఘటనలు బాధకలిగించాయి. జాతీయ పతాకాన్ని అవమానించడం దురదృష్టకరం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం.. చట్టాలు, నిబంధనలు పాటించాలని కూడా చెబుతోందన్నారు రాష్ట్రపతి కోవింద్

Also Read: : ఇవాళ్టి నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు..!