పూజారి సజీవదహనం కేసు.. బంధువుల డిమాండ్

రాజస్తాన్ లో దుండగుల చేతిలో సజీవదహనమైన పూజారి బాబూలాల్ మృత దేహానికి అంత్యక్రియలు చేయబోమని ఆయన బంధువులు నిరసనకు దిగారు. తమకు పరిహారంగా రూ. 50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,

పూజారి సజీవదహనం కేసు.. బంధువుల డిమాండ్

Edited By:

Updated on: Oct 10, 2020 | 2:20 PM

రాజస్తాన్ లో దుండగుల చేతిలో సజీవదహనమైన పూజారి బాబూలాల్ మృత దేహానికి అంత్యక్రియలు చేయబోమని ఆయన బంధువులు నిరసనకు దిగారు. తమకు పరిహారంగా రూ. 50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నిందితులందరి అరెస్ట్ తమ డిమాండ్లని వీటిని తీర్చేవరకు బాబూలాల్ డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించే ప్రసక్తే లేదని వారు అంటున్నారు. అలాగే రెవెన్యూ అధికారిపైన, నిందితులకు సహకరిస్తున్న పోలీసులపైన కఠిన చర్య తీసుకోవాలని వారు కోరారు. కాగా-ఈ కేసులో ప్రధాన నిందితుడైన కైలాష్ మీనాను పోలీసులు అరెస్టు చేశారు. కరౌలీ జిల్లా బుక్నా గ్రామంలో ఈ నెల 8 న ఈ దారుణం జరిగింది. 5.2 ఎకరాల భూవివాదం పూజారి ప్రాణాలను బలిగొంది.