Fake Voter Cards: యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్ ఓటర్ ఐడెంటిటీ కార్డుల జారీ.. పలువురి అరెస్ట్..

| Edited By: Anil kumar poka

Aug 19, 2021 | 12:20 PM

యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్ ఓటర్ ఐడెంటిటీ కార్డుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది..ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి కొంత సొమ్ముకు ఈ కార్డులను 'అమ్ముతున్న' పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు

Fake Voter Cards: యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్ ఓటర్ ఐడెంటిటీ కార్డుల జారీ.. పలువురి అరెస్ట్..
Fake Voter Identity Cards Issue In Up
Follow us on

యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్ ఓటర్ ఐడెంటిటీ కార్డుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది..ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి కొంత సొమ్ముకు ఈ కార్డులను ‘అమ్ముతున్న’ పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ యవ్వారం బయటపడింది. యూపీలోని సహరన్ పూర్ లో ఈ నెల 13 న విపుల్ సైని అనే 24 ఏళ్ళ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్న ఇతగాడు..మధ్యప్రదేశ్ కి చెందిన అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి సూచనపై మూడు నెలల్లో 10 వేలకు పైగా బూటకపు ఓటర్ ఐడెంటిటీ కార్డులను తయారు చేశాడట.. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడట.. ఒక్కో కార్డుకు ఇతనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలవరకు ముట్టేదట.. ఇతని బ్యాంకు అకౌంట్ లో 60 లక్షల రూపాయలు క్రెడిట్ కాగా ఆ ఖాతాను పోలీసులు స్తంభింపజేశారు. సైనితో బాటు మరికొందరిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే ఝార్ఖండ్లోని పాలమూ జిల్లాలో 30 ఏళ్ళ ముకేశ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఈ నెల 17 న అరెస్టు చేశారు. రాంచీ లోని ఓ వ్యక్తి నుంచి తనకు లింకులు, పాస్ వర్డులు అందేవని ఇతడు చెప్పినట్టు తెలుస్తోంది.

బీహార్, యూపీ రాష్ట్రాల్లో ఈ రాకెట్ నెట్ వర్క్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తమ డేటా బేస్ సురక్షితంగా ఉందని ఎన్నికల కమీషన్ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా ఫేక్ ఓటర్ ఐడెంటిటీ కార్డులను ఉపయోగించి ఓటు వేయజాలరని మాజీ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ఎస్.వై ఖురేషీ చెప్పారు. అందువల్ల ప్రజలు గానీ, పార్టీలు లేదా ఈసీ నిశ్చింతగా ఉండవచ్చునన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పరు.. కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్..! ఏంటో తెలుసా..?Agarwal Sisters Video.

 70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.

 Feed the Need video: హ్యాపీ ఫ్రిజ్‌లు.. అప్పుడలా.. ఇప్పుడిలా..50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా..?(వీడియో)

 టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.