దేశంలో పలు చోట్ల ఫేక్ వ్యాక్సినేషన్ ఉదంతాలు పెరుగుతున్నాయి. ముంబై. కోల్ కతా వంటి నగరాల తరువాత ఇప్పుడు భోపాల్ వంతు ! ఈ నగరంలోని తిలా జమాల్ పూర్ అనే ప్రాంతానికి చెందిన 13 ఏళ్ళ దివ్యాంగ బాలునికి టీకామందు వేసినట్టు మెసేజ్ అందింది. నిజానికి అధికారికంగా 18 ఏళ్ళ లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించలేదు. పైగా ఫోన్ లో అందిన మెసేజ్ లో ఇతని వయస్సును 56 ఏళ్లుగా చూపారు. దీనిపై తాను ఫిర్యాదు చేయడానికి యత్నించినా ఫలితం లేకపోయిందని ఈ బాలుడి తండ్రి రజత్ డాంగ్రే అన్నారు. లింక్ ను ఉపయోగించి సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసినప్పుడు తన పెన్షన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ కు సమర్పించిన డాక్యుమెంట్లనే అధికారులు వాడి..ఈ మెసేజ్ పంపినట్టు తెలిసి షాక్ తిన్నానన్నాడు. అటు వ్యాక్సిన్ తీసుకోని వారిని కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్టు సందేశాలు వస్తున్నాయట. చైనేంద్ర పాండే అనే వ్యక్తికి కేవలం 5 నిముషాల్లో వేర్వేరు మెసేజ్ లు అందాయి. తనకు తెలియని ముగ్గురు వ్యక్తుల పేర్లను అందులో ప్రస్తావించారట.
నేను అసలు టీకామందు తీసుకోనేలేదు అని ఆయన అన్నాడు. అలాగే 46 ఏళ్ళ నుజత్ సలీమా అనే మహిళ తాను పెన్షనర్ కాకపోయినా పింఛను పత్రాలు నమోదు చేసినట్టు తనకు అందిన మెసేజులో ఉన్నట్టు చెప్పింది. ట్యాక్స్ కన్సల్టెంట్ అయిన ప్రేమ్ పాండ్యా తను స్లాట్ బుక్ చేసినప్పటికీ టీకామందు తీసుకోలేదని,,కానీ అదే రోజున తీసుకున్నట్టు సందేశం అందిందని చెప్పారు. ఇప్పటివరకు రెండున్నరవేలమంది ఇలా ఫేక్ వ్యాక్సిన్లు తీసుకున్నట్టు సమాచారం..దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతున్నట్టు క్రెడిట్ పొందడానికే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Murder: విశాఖ ఏజెన్సీలో దారుణం.. ఆస్థి కోసం అన్నను కత్తితో నరికి చంపిన తమ్ముడు..
ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి మరో షాక్..ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపిన ఫలితం…