Trending: ఉన్నపలంగా నిధి కలిసి వస్తుంది అంటే ఇంట్లోనే తవ్వకాలు జరిపేవారు ఉన్నారు. కన్న పిల్లలను బలిచ్చే ఉన్నాదులను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయినా నిధి.. నిక్షేపాలు దొరికే పని అయితే.. వారు తవ్వకుంటారు కదా..! మీకెందుకు చెప్తారు చెప్పండి. మొత్తుకుని మరీ చెబుతున్నాం.. అయినా జనాలు మారడం లేదు. గుప్త నిధులు, రైస్ పుల్లింగ్, అతీత శక్తులు ఉన్న విగ్రహాలు అని చెప్పే మోసగాళ్ల మాయలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత మోసపోయాం బాబోయ్ అని బోరున విలపిస్తూనే ఉన్నారు. తాజాగా కర్ణాటక(Karnataka)లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వారి పొలంలో బంగారు నిధి ఉందని.. దాన్ని వెలికి తీస్తానంటూ భార్యభర్తలను నిండా ముంచేశాడు ఓ కేడీ స్వామీజీ. అతడి మాయమాటలు నమ్మిన దంపతులు 5 లక్షలు సమర్పించుకున్నారు. మోసాన్ని తెలుసుకునేలోపే కేటుగాడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హసన్ జిల్లా(Hassan District) దొడ్మగ్గే గ్రామంలో లీలావతి, మంజేగౌడ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల ఓ కేటుగాడు వారి పొలంలో గుప్తనిధులు ఉన్నాయని నమ్మించాడు. తనకు అతీత శక్తులు ఉన్నాయని.. ఆ నిధి బయటకు తీస్తానని నమ్మించాడు. ఆ మోసగాడి ట్రాప్‌లో పడ్డారు ఆ దంపతులు. పక్కాగా ప్లాన్ చేసిన దొంగ స్వాములోరు.. ముందుగానే వారి పొలంలో గోల్డ్ పూత పూసిన 3 కేజీల సిల్వర్ విగ్రహాన్ని పాతిపెట్టాడు. ఆ తర్వాత ఆ కపుల్‌ను పొలానికి తీసుకెళ్లి.. ఏవో తాంత్రిక పూజలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి.. అంతకుముందే పాతిపెట్టిన విగ్రహాన్ని బయటకు తీశాడు. వామ్మో తమకు ఎంత అదృష్టం కలిసొచ్చిందో అని ఆ దంపతులు సంబరపడ్డారు. ఆపై రక్తంతో అభిషేకం చేయాలంటూ.. లీలావతి ఫింగర్ కోసేశాడు. తమకు సిరిలు తీసుకొచ్చిన స్వామీజీకి 5 లక్షలు దక్షిణగా ఇచ్చారు ఆ దంపతులు. కొన్ని రోజుల తర్వాత వారు ఆ విగ్రహాన్ని.. తెలిసిన సేట్ వద్ద తనిఖీ చేయించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. అది సిల్వర్ విగ్రహమని తేలింది. దీంతో మోసపోయామని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కాప్స్.. దర్యాప్తు షురూ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి