Fake Currency: ఫేక్‌గాళ్ల ఆటకట్టించిన పోలీసులు.. పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీ సీజ్‌..ఎక్కడంటే..

|

Jul 14, 2022 | 8:10 AM

అప్పుడే ప్రింట్‌ తీసినట్టుగా ఉన్న నోట్లు చూస్తే ఎవరైనా అవి ఫేక్‌ కరెన్సీ అని నమ్మలేరు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Fake Currency: ఫేక్‌గాళ్ల ఆటకట్టించిన పోలీసులు.. పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీ సీజ్‌..ఎక్కడంటే..
Fake Currency
Follow us on

Fake Currency: దొంగనోట్ల ముఠా కలకలం రేపింది. అప్పుడే ప్రింట్‌ తీసినట్టుగా ఉన్న నోట్లు చూస్తే ఎవరైనా అవి ఫేక్‌ కరెన్సీ అని నమ్మలేరు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా.. జుజుమారా పోలీస్ ఆధ్వర్యంలో నువా అధాపాడ గ్రామంలో STF దాడులు నిర్వహించింది. పోలీసుల తనిఖీల్లో ఇద్దరు మోసగాళ్లను స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒడిశాలోని సంబల్పూర్‌ జిల్లాలో జోరుగా నకిలీ నోట్ల తయారీ, చెలామణి జరుగుతోందని తెలిసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.15,12,500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్‌ కరెన్సీతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక కలర్ ప్రింటర్ సీజ్‌ చేశారు. ఇద్దరు కేటుగాళ్లను అరెస్ట్‌ చేశారు. నిందితులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తులు నువా అడపాడకు చెందిన పోదర్ ప్రసాద్ సాహు, బుర్దాకు చెందిన జన్మజయ బాగ్‌గా గుర్తించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి