Harassment: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు.. ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

నేటి సమాజంలో మహిళలు, యువతులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. అన్ని చోట్లా వారికి రక్షణ లేకుండా పోతోంది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఉద్యోగాలు నిర్వహించే మహిళలకూ ఈ వేధింపులు తప్పడం...

Harassment: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు.. ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..
Woman Harassment

Updated on: Dec 11, 2022 | 5:46 PM

నేటి సమాజంలో మహిళలు, యువతులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. అన్ని చోట్లా వారికి రక్షణ లేకుండా పోతోంది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఉద్యోగాలు నిర్వహించే మహిళలకూ ఈ వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు కామన్ అయిపోయాయి. అయితే ప్రభుత్వం దృష్టిలో ఇది తీవ్రమైన సమస్య మాత్రమే కాకుండా క్రిమినల్ నేరం. ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రతి ఐదుగురిలో ఒకరు శారీరక, మానసిక లేదా లైంగిక వేధింపులకు గురవుతున్నారని వెల్లడించింది. పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు ఎక్కువగా గురవుతున్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా బాధితులు అవుతున్న సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అనవసరంగా తాకడం, అవసరం లేకున్నా ఎక్కువగా మాట్లాడటం, డబుల్ మీనింగ్ డైలాగ్ లు చెప్పడ, ఎగతాళి చేయడం, అభ్యంతరకరమైన జోకులు వేయడం వంటివన్నీ లైంగిక వేధింపుల కిందికే వస్తాయి. ఇది మహిళా ఉద్యోగులను మానసికంగానూ, శారీరకంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది.

పనిలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు భావించినట్లయితే..గట్టిగా ఎదురుతిరగాలని నిపుణులు చెబుతున్నారు. చట్టపరమైన హక్కులను తెలుసుకోవాలి. ప్రతి కంపెనీలో ఉద్యోగి హ్యాండ్‌బుక్ ఉంటుంది. వర్క్‌ ప్లేస్‌లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, 2013 ప్రకారం.. పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ కార్యాలయంలో లైంగిక వేధింపుల నివారణ, నిషేధం పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. అసౌకర్యం కలిగించే పనిని చెప్పినప్పుడు లేదా చేసినప్పుడు.. సాధారణంగా చెప్పేదాని కంటే గట్టిగానే నిలబడాలి. దానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలి.

వేధింపులు మరీ ఎక్కువగా మారితే ముందుగా ఆఫీస్ యాజమాన్యానికి తెలపాలి. వారూ చర్యలు తీసుకోకుంటే అప్పుడు విషయాన్ని అంతర్గత ఫిర్యాదుల కమిటీ కంప్లైంట్ చేయాలి. న్యాయం జరగలేదని భావిస్తే కోర్టుకు వెళ్లే హక్కు ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లైంగిక వేధింపులకు సంబంధించి ఏదైనా పరిస్థితిని ఎదుర్కొంటే.. త్వరగా అలర్ట్ అవ్వాలి. ఎంత భద్రంగా ఉన్నారనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అక్కడ పనిచేయడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి విశ్లేషించి తదుపరి నిర్ణయం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..