Covishield Doses Gap Increase: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ విపత్కర సమయంలో ఎప్పుడు ఏ దుర్వార్త వినాలో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాను నివారించే మార్గాల్లో ఒకటి వ్యాక్సినేషన్. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో అడ్వైజరీ బృందం సిఫార్సు మేరకు టీకా ప్రోటోకాల్స్‌లో పలు మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కోవిషీల్డ్ రెండో డోసును 6 నుంచి 8 వారాల్లో ఇస్తుండగా.. ఇప్పుడు ఆ గడువు 12-16 వారాలకు పొడిగించే అవకాశం ఉంది. అటు గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతి లభించవచ్చునని తెలుస్తోంది. ఇక ఈ కొత్త రూల్స్ కేవలం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు మాత్రమే వర్తించనున్నాయి. కొవాగ్జిన్ వ్యవధిలో మాత్రం ఎటువంటి మార్పులను సూచించలేదు.
నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టిఎజిఐ) కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేసింది. కోవిడ్ సోకిన రోగులకు కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకాలు ఇవ్వాలని సూచిస్తోంది. త్వరలోనే దీనిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
మొదటిగా NTAGI సిఫార్సులు నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆఫ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ కోవిడ్ 19 బృందానికి పంపబడుతుంది. అనంతరం నిపుణుల బృందం తన సిఫార్సులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 1 నుండి 2 రోజులు పట్టవచ్చు.
షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లో ఎగిరిన బైక్‌రైడర్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!
వాట్సాప్‌లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!
గగుర్పాటుకు గురిచేసే వీడియో.. పక్షి గూటిలోకి భారీ పైథాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!
డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!