Maharashtra: కసబ్‌కు కూడా అంత లేదు.. షిండే సర్కారుపై ఆదిత్యా థాక్రే ఘాటు వ్యాఖ్యలు

|

Jul 03, 2022 | 4:43 PM

Maharashtra politics: ముంబైలో ఈ స్థాయి భద్రతా ఏర్పాట్లు తాము ముందెన్నడూ చూడలేదని శివసేన సేన ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు. మరీ అంత భయమెందుకని ప్రశ్నించిన ఆయన.. ఎవరైనా పారిపోతారని భయపడుతున్నారా? అంటూ వ్యాఖ్యలు చేశారు.

Maharashtra: కసబ్‌కు కూడా అంత లేదు.. షిండే సర్కారుపై ఆదిత్యా థాక్రే ఘాటు వ్యాఖ్యలు
Shiv Sena Leader Aaditya Thackeray (File Photo)
Image Credit source: TV9 Telugu
Follow us on

Maharashtra Politics: మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ శివసేన నేత ఆదిత్య థాక్రే(Aaditya Thackeray) విమర్శనాస్త్రాలు సంధించారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత కల్పించడంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కసబ్‌కు కూడా శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కల్పిస్తున్న స్థాయిలో భద్రత కల్పించలేదని అన్నారు. ముంబైలో ఈ స్థాయి భద్రతా ఏర్పాట్లు తాము ముందెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మరీ అంత భయమెందుకని ప్రశ్నించిన ఆదిత్య థాక్రే.. ఎవరైనా పారిపోతారని భయపడుతున్నారా? అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం గోవా నుంచి ముంబైలోని స్టార్ హోటల్‌కు చేరుకున్నారు. గత రాత్రి వారు హోటల్‌లో బస చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం ప్రత్యేక బస్సులో వారిని హోటల్ నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చారు. వారి వెంటే సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా ఉన్నారు. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నిర్వహించగా.. సోమవారం ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. షిండే వర్గం తిరుగుబాటుతో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ సంకీర్ణ సర్కారు కుప్పకూలడం తెలిసిందే. ఉద్ధవ్ థాకరే రాజీనామా చేయడంతో మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ నాలుగు రోజలు క్రితం ప్రమాణ స్వీకారం చేశారు.

ఇవి కూడా చదవండి

షిండే వర్గంలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేన పార్టీకి చెందిన 39 మంది రెబల్ ఎమ్మెల్యేలతో పాటు చిన్నాచితక పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు 10 మంది షిండే వెంట ఉన్నారు. 288 మంది ఎమ్మెల్యేలతో కూడిన మహారాష్ట్ర అసెంబ్లీలో 106 మంది ఎమ్మెల్యేల బీజేపీ మద్ధతు కూడా షిండేకి ఉంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..