Suicide: సైఫాయి మెడికల్‌ కాలేజీలో విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఇష్యూపై సీఎం సీరియస్‌.. ముమ్మర దర్యాప్తు

|

Aug 22, 2022 | 9:13 AM

దేశవ్యాప్తంగా మెరుగైన వైద్యం కోసం గ్రామీణ ప్రాంతంలోని ప్రముఖ సైఫాయి మెడికల్ యూనివర్సిటీలో జూనియర్ డాక్టర్లు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇక్కడి పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నార్థకంగా మారాయి.

Suicide: సైఫాయి మెడికల్‌ కాలేజీలో విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఇష్యూపై సీఎం సీరియస్‌.. ముమ్మర దర్యాప్తు
Medical Student
Follow us on

Uttar Pradesh: విద్యార్థిని మృతితో హాస్టల్‌లో కలకలం రేగింది. కుమారుడి మృతి సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తెల్లవారుజామునే యూనివర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. కుమారుడి మృతదేహం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.. విద్యార్థి మృతిని ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే మృతుడి గదిలోంచి ఎలాంటి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. అయితే, మృతుడు హిమాన్షు తల్లిదండ్రులు మాత్రం దీనిని హత్యగా ఆరోపిస్తున్నారు. హిమాన్షు తల్లి సరిత తాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వస్థలం గోరఖ్‌పూర్‌ నివాసినంటూ,యోగి జీ తమకు న్యాయం చేయండి అంటూ వేడుకోసాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి అనుమానాస్పద మృతితో కలకలం రేగింది. మృతి చెందిన విద్యార్థి హిమాన్షు గుప్తా గోరఖ్‌పూర్ జిల్లా వాసి. ఈ సంఘటన శనివారం జరిగింది. హిమాన్షు గుప్తా శాక్యముని హాస్టల్‌లోని రూం నంబర్ 209లో నివసించినట్లు చెబుతున్నారు. శనివారం మరణించిన విద్యార్థి భోజనం చేయడానికి మెస్‌కు వెళ్లకపోవడంతో, హిమాన్షు స్నేహితులు రాత్రి 9 గంటల సమయంలో అతని గదికి వెళ్లారు. గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. చాలా సేపటికి గాని హిమాన్షు తలుపులు తెరవకపోవడంతో సెక్యూరిటీ గార్డులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

సెక్యూరిటీ గార్డుల సహాయంతో ఇతర విద్యార్థులు తలుపులు పగులగొట్టి మృతుడి గదిలోకి ప్రవేశించారు. గదిలోని దృశ్యం చూసి సెక్యూరిటీ సిబ్బందితో సహా విద్యార్థులంతా ఉలిక్కిపడ్డారు. లోపల మరణించిన హిమాన్షు మృతదేహం సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో విద్యార్థులు వెంటనే యూనివర్సిటీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానల్ ద్వారా పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కుమారుడి మరణవార్త అందుకున్న మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి మృతిని ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే మృతుడి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. హిమాన్షు తల్లిదండ్రులు దీనిని హత్యగా అభివర్ణించారు. హిమాన్షు తల్లి సరిత తాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వస్థలం గోరఖ్‌పూర్‌ నివాసి అని స్పష్టంగా చెప్పారు. యోగి జీ తమకు న్యాయం చేయండి. కుమారుడి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని మృతుడి తల్లి డిమాండ్ చేశారు. కుట్రలో భాగంగానే తన కుమారుడిని హత్య చేశారని వారు ఆరోపించారు.

ఇదిలా ఉంటే, ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీలో విద్యార్థి మృతిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.. గోరఖ్‌పూర్ MBBS విద్యార్థి హిమాన్షు గుప్తా అనుమానాస్పద మృతిపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి, మొత్తం విషయంపై దర్యాప్తు చేయాలని ఇటావా జిల్లా మేజిస్ట్రేట్ మరియు SSPని ఆదేశించారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు.

దేశవ్యాప్తంగా మెరుగైన వైద్యం కోసం గ్రామీణ ప్రాంతంలోని ప్రముఖ సైఫాయి మెడికల్ యూనివర్సిటీలో జూనియర్ డాక్టర్లు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇక్కడి పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నార్థకంగా మారాయి. అంతకుముందు 2019లో సైఫాయిలో మూడు హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. 2020 అక్టోబర్‌లో ఆత్మహత్య ఘటన కూడా జరిగింది. ఇప్పుడు ఈ 5వ సంఘటన 2022లో జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి