Viral Video: ప్రభుత్వ క్లర్క్ ఇంట్లో భారీగా పట్టుబడిన సొమ్ము.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..

Viral Video: అతనో సాధారణ క్లర్క్.. అతని జీతం నెలకు రూ. 50 వేలు ఉంటుంది. కానీ, ఆస్తులు మాత్రం కోట్లు. అతనికి మూడు కార్లు, రెండు బైకులు, పలు చోట్ల విలాసవంతమైన భవనాలు.

Viral Video: ప్రభుత్వ క్లర్క్ ఇంట్లో భారీగా పట్టుబడిన సొమ్ము.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..
Money
Follow us

|

Updated on: Aug 04, 2022 | 5:21 PM

Viral Video: అతనో సాధారణ క్లర్క్.. అతని జీతం నెలకు రూ. 50 వేలు ఉంటుంది. కానీ, ఆస్తులు మాత్రం కోట్లు. అతనికి మూడు కార్లు, రెండు బైకులు, పలు చోట్ల విలాసవంతమైన భవనాలు. ఇదీ అతని సంపాదన. అవును మీరు చదివింది నిజంగా నిజం. అయితే, ఒక క్లర్క్‌ కు ఇంత మొత్తంలో ఆస్తులు ఎక్కడవనే సందేహం సహజంగానే వస్తుంది. అదే సందేహం.. మధ్యప్రదేశ్‌లోని ఆర్థిక నేరాల విభాగం అధికారులకూ(EOW) వచ్చింది. కోట్ల విలువ చేసే ఒక ప్రాపర్టీ కొనుగోలు సమయంలో వారికి సందేహం రావడంతో.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైడ్స్ చేశారు. ఆ రైడ్స్‌లో అధికారులకు కళ్లు చెదిరే డబ్బు, ఆస్తి పత్రాలు, ఆభరణాలు పట్టుబడ్డాయి. తనిఖీల సందర్భంగా పట్టుబడిన డబ్బుకు సంబంధిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను నెటిజన్లు.. ఇంత డబ్బులు ఎలా సంపాదించార్రా బాబూ అని నోరెళ్ల బెడుతున్నారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సీనియర్ క్లర్క్‌గా పని చేస్తున్న హీరో కేశ్వాని నివాసంలో ఆర్థిక నేరాల విభాగం(EOW) సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో EOW బృందం సుమారు కోటి రూపాయల నగదును రికవరీ చేసింది. దీంతో పాటు అతని భార్య పేరుమీదున్న మూడు లగ్జరీ ఫోర్ వీలర్ వాహనాలు, ఒక స్కూటీ, లక్షల రూపాయలను, ఆమె పేరిట ఉన్న కోట్లాది రూపాయల ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించిన వివరాలను కోరగా.. సమాధానం చెప్పలేదు. దాంతో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

పినాయిల్ తాగి రచ్చ..

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈఓడబ్ల్యూ అధికారులు కేశవాని ఇంటికి చేరుకోగానే.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం చేయాలో పాలుపోక.. టాయిలెట్ క్లీనర్ అయిన పినాయిల్ తాగేశాడు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. రూ. 4000 జీతంతో ఉద్యోగం ప్రారంభించిన కేశవాని.. ప్రస్తుతం రూ. 50,000 అందుకుంటున్నాడు. కానీ, అతని ఆస్తులు మాత్రం కోట్లలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇంటి ఫ్లోర్ డిజైన్ చూసి బిత్తరపోయిన అధికారులు..

కేశవాని ఇంటిపై రైడ్‌కు 15 మంది అధికారుల బృందం వెళ్లింది. అయితే, సోదాల సమయంలో హీరో కేశవాని ఇంటిని చూసి అధికారుల షాక్ అయ్యారు. నేలపై, సీలింగ్‌పై డిజైన్‌ను చూసి కళ్లు తేలేశారు. ఒక రాజు ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఉందని వారు చెబుతున్నారు. కేశవాని ఇంట్లో పురాతన వస్తువులు కూడా ఉన్నాయన్నారు. ఇంటి నిండా లక్షలాది విలువ చేసే అలంకరణలు ఉన్నాయని, సీలింగ్‌కు వేసిన పెయింట్ ఖర్చు కూడా లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు. ఇంటి విలువ దాదాపు రూ. 1.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

బంధువుల ఖాతాల్లోనూ డబ్బు..

హీరో కేశ్వానిపై ఇంటిపై జరిపిన సోదాల్లో.. కీలక వివరాలు సేకరించారు ఈవోడబ్ల్యూ అధికారులు. వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలతో పాటు.. బంధువుల ఖాతాలనూ సోదా చేయగా.. లక్షలాది రూపాయలు లభించాయి. కేశవాని కుటుంబ సభ్యుల ఖాతాల్లోనూ డబ్బులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఇంటి గోడల్లో డబ్బులు..

ఈఓడబ్ల్యూ అధికారులు కేశ్వాని ఇంటి గోడల నిర్మాణాన్ని చూసి షాక్ అయ్యారు. గోడల్లోనూ నగదు పట్టుబడిందని అధికారులు తెలిపారు. స్టోర్ రూమ్‌లోనూ, ఇంట్లో ప్రతీ మూలనా ఒక రహస్య ప్లేస్‌ను గుర్తించారు అధికారులు. భారీగా డబ్బుతో పాటు, బంగారు, వెండి ఆభరణాలు కూడా గుర్తించారు అధికారులు. వాటన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.

సైకిల్‌పై ఆఫీసుకు..

ఉద్యోగం పొందిన కొత్తలో కేశవాని బైరాగఢ్‌కు సైకిల్‌పై వచ్చేవాడు. ఆ తరువాత కాలం గడిచే కొద్ది చాలా వృద్ధి సాధించాడు. అతని వైభవం అంతకంతకూ పెరుగుతూపోయింది. అతనికి, అతని పిల్లలకు 3 కార్లు కొనుగోలు చేశాడు. అయినప్పటికీ అతను ఎప్పుడూ ఒక స్కూటీపై తిరిగేవాడు. దానిపైనే ఆఫీసుకు వచ్చేవాడు అని అధికారులు తెలిపారు.

పెద్దల ప్రమేయంపై ఆరా..

సీనియర్ క్లక్క్ అయిన కేశవాని ఇంత పెద్ద మొత్తంలో సంపాదించడం వెనుక పెద్దల ప్రమేయం ఏమైనా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. డీలర్స్, పొలిటీషియన్స్‌తో కేశవానికి సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో.. ఆ దిశగానూ కూపీ లాగుతున్నారు అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..