Encounter In kashmir: బార్డర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టుల హతం.

| Edited By: Ravi Kiran

Mar 22, 2021 | 10:11 AM

Encounter In kashmir: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి...

Encounter In kashmir: బార్డర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టుల హతం.
Encounter In Kashmir
Follow us on

Encounter In kashmir: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. భద్రత దళాలు చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ప్రస్తుతం జవాన్లు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సమన్వయంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం రెండు గంటలకు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా ఉగ్రవాదులే కాల్పులు జరపడంతో భద్రత దళాలు ప్రతి చర్యగా కాల్పులు మొదలుపెట్టారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: COVID-19 vaccine: భారత్ ఆపన్నహస్తం.. 76 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్రమంత్రి హర్షవర్ధన్

ICAI CA Final Result Jan 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. రెండు లక్షల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు..