AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

161 మందితో వైజాగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం.. గాలిలో ఉండగా, ఇంజన్ ఫెయిల్..!

విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానంలో ఇంజన్ వైఫల్యం తలెత్తినట్లు సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో శనివారం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ తోపాటు, విమానాశ్రయ అధికారులు తక్షణమే అత్యవసర నిబంధనలను అమలు చేశారు.

161 మందితో వైజాగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం.. గాలిలో ఉండగా, ఇంజన్ ఫెయిల్..!
Indigo Flight
Balaraju Goud
|

Updated on: Mar 28, 2026 | 1:17 PM

Share

విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానంలో ఇంజన్ వైఫల్యం తలెత్తినట్లు సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో శనివారం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ తోపాటు, విమానాశ్రయ అధికారులు తక్షణమే అత్యవసర నిబంధనలను అమలు చేశారు. విమానాశ్రయంలోని 28వ రన్‌వేను వెంటనే మూసివేశారు.

అధికారుల అప్రమత్తంతో 161 మంది ప్రయాణికులతో వెళ్తున్న విశాఖపట్నం-ఢిల్లీ విమానం శనివారం (మార్చి 28) ఉదయం 11 గంటల ప్రాంతంలో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిది. రన్‌వే పొడవునా అగ్నిమాపక దళ వాహనాలు, అంబులెన్స్‌లను మోహరించారు. ల్యాండింగ్ అనంతరం ప్రయాణీకులను సురక్షితంగా తరలించారు. ఈ విషయంపై ఇండిగో ఇంకా స్పందించలేదు.

విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానం ఉదయం 10.53 గంటలకు అత్యవసరంగా కిందకు దిగింది. విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందింది. ఆ తర్వాత అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. పోలీసులు, ఎయిర్ పోర్టు సిబ్బంది, అగ్నిమాపక వాహనాలను కూడా ఘటనా స్థలానికి పంపించారు. చివరికి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

ఇదిలావుంటే, మార్చి 26న, విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఒక విమానం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతుండగా, పైలట్ అకస్మాత్తుగా విమానాన్ని పైకి లేపాల్సి వచ్చింది. దీనిని గో-అరౌండ్ అంటారు. విమానం రన్‌వేను తాకి అకస్మాత్తుగా పైకి లేవడంతో ప్రయాణికులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ విమానం సుమారు 7-8 నిమిషాల పాటు ఢిల్లీ, ఘజియాబాద్‌ల మీదుగా చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, జేడీఎస్ నాయకుడు హెచ్‌డి రెవన్న కూడా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!
రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు
రూ.2కే కోడిగుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే గుట్టురట్టు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!