Lok Sabha: ఈ రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్‎కు నామినేషన్ల ప్రక్రియ షురూ.. పొత్తులు, ఎత్తులతో బిజీగా నేతలు..

రెండో దశ పోలింగ్‌కు కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో దేశంలో అనేక ప్రాంతాల్లో రాజకీయం జోరందుకుంటోంది. ప్రచారాలు ఒక వైపు, పొత్తులు మరో వైపు పొలింగ్‌ హీట్‌ను పెంచుతున్నాయి. ఎలక్షన్‌ టాప్‌ నైన్‌ న్యూస్‌ చూద్దాం. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు కర్నాటక ప్రజలకు మంచి సందేశాన్ని తాము ఇచ్చామని మాజీ ప్రధాని, JDS అధ్యక్షుడు HD దేవెగౌడ అన్నారు.

Lok Sabha: ఈ రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్‎కు నామినేషన్ల ప్రక్రియ షురూ.. పొత్తులు, ఎత్తులతో బిజీగా నేతలు..
Second Phase Election

Updated on: Mar 29, 2024 | 9:40 PM

రెండో దశ పోలింగ్‌కు కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో దేశంలో అనేక ప్రాంతాల్లో రాజకీయం జోరందుకుంటోంది. ప్రచారాలు ఒక వైపు, పొత్తులు మరో వైపు పొలింగ్‌ హీట్‌ను పెంచుతున్నాయి. ఎలక్షన్‌ టాప్‌ నైన్‌ న్యూస్‌ చూద్దాం. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు కర్నాటక ప్రజలకు మంచి సందేశాన్ని తాము ఇచ్చామని మాజీ ప్రధాని, JDS అధ్యక్షుడు HD దేవెగౌడ అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ఓడిపోతుందని, మొత్తం 28 ఎంపీ స్థానాలను బీజేపీ-JDS కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరులో BJP-JDS సమన్వయ కమిటీ సమావేశంలో దేవెగౌడ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో JDS- BJP ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు.

బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ మధ్య పొత్తు ఖరారైంది. RJD, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ నేతలు పట్నాలో తమ పొత్తును ప్రకటించారు. పొత్తులో భాగంగా RJD 26 స్థానాల్లో పోటీ చేయనుంది. పొత్తును RJD నేత తేజస్వి యాదవ్‌ ప్రకటిస్తారని ముందు తెలిపినా ఆయన మాత్రం ఈ సమావేశానికి రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ బిహార్‌లో తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది. మండి లోక్‌సభ స్థానంలో తనకు అద్భుతమైన మెజార్టీ వస్తుందని, అది ఒక ఉదాహరణగా నిలిచిపోతుందని బీజేపీ అభ్యర్థి కంగనా రనావాత్‌ అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి మండి వచ్చిన కంగనా అక్కడ రోడ్‌ షో నిర్వహించారు. తనపై ఉన్న ప్రేమాభిమానాలను మండి ప్రజలు ఎన్నికల్లో చూపిస్తారని కంగనా అన్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐ, NIA, ఐటీ, ఈడీల ద్వారా తమ పార్టీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలను వేధిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఏజెన్సీల రాకపోకలు తగ్గుతాయని, కాని ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని TMC నేతలన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించుకోవాలని సూచించారు. TMC నేతల బృందం ఈసీని కలిసి ఈ విషయాలపై ఫిర్యాదు చేసింది. ఈ విషయాలు వినేందుకు సోమవారం ఈసీ తమకు సమయం కేటాయించిందని తృణమూల్‌ నాయకులు వెల్లడించారు. ప్రధాని మోదీని గెలిపించేందుకు మొత్తం తమిళనాడు ఏప్రిల్‌ 19 కోసం ఎదురుచూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. జూన్‌ 4న తమిళనాడులో మోదీ వేవ్‌ చూడవచ్చని తెలిపారు. పొత్తులో భాగంగా శ్రీపెరంబదూరులో పోటీ చేస్తున్న TMC అభ్యర్థి వేణుగోపాల్ తరపున అన్నామలై ప్రచారం నిర్వహించారు.

బీజేపీ వల్ల తమిళనాడుకు నష్టం కాబట్టే తాము ఆ కూటమి నుంచి బయటకు వచ్చామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే తమిళనాడు సీఎం, ఆయన కుమారుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులోని మధురైలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని పళనిస్వామి ప్రారంభించారు. పార్టీ నిర్ణయం మేరకే OPS నుంచి బయటకు పంపించామని పళనిస్వామి తెలిపారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తిరువళ్లూరు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేశారు. ప్రజాప్రతినిధిగా వివిధ మతాలకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడం తన బాధ్యత అని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ అన్నారు. తిరువనంతపురంలోని చర్చిలో గుడ్‌ఫ్రైడే సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో థరూర్‌ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా తాను నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఇఫ్తార్‌ విందులకు కూడా హాజరవుతున్నానని శశి థరూర్‌ అన్నారు. ఈ ఎన్నికల సీజన్‌లోనే ఈస్టర్‌, రంజాన్‌, మలయాళ కొత్త సంవత్సరం విషు కూడా వస్తున్నాయని, ఇది చాలా అరుదని తెలిపారు. సొంత కుటుంబాన్ని కాపాడులేకపోయినా శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలను ఏం రక్షిస్తారని అమరావతి బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్‌ రాణా ఆరోపించారు. ఇంట్లోంచి బయటకు రాలేని, ఎండలో రెండు గంటల సేపు నిల్చొలేని ఉద్ధవ్‌ ఠాక్రుకు జనాలు సమస్యలు ఏ మాత్రం తెలియవని అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ప్రభావం మహారాష్ట్రలో ఏ మాత్రం ఉండదని నవనీత్‌ రాణా అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..