AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections: ఎంపీ కారును తూతూ మంత్రంగా తనిఖీ.. స్క్వాడ్‌ టీమ్‌ మొత్తాన్ని మార్చేసిన ఈసీ

పార్లమెంటు సభ్యుడి వాహనాన్ని తూతూ మంత్రంగా తనిఖీ చేసిన అధికారులపై కన్నెర్ర చేసింది ఎన్నికల సంఘం. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ మొత్తాన్ని మార్చేసింది ఈసీ. తమిళనాడులోని నీలగిరికి చెందిన డిఎంకె అభ్యర్థి ఎ రాజా వాహనాన్ని తనిఖీ చేయడంలో అలసత్వం వహించినందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలోని అధికారిని విధుల నుంచి తొలగించింది

Lok Sabha Elections: ఎంపీ కారును తూతూ మంత్రంగా తనిఖీ.. స్క్వాడ్‌ టీమ్‌ మొత్తాన్ని మార్చేసిన ఈసీ
Dmk Mp Raja
Balaraju Goud
|

Updated on: Mar 31, 2024 | 8:31 AM

Share

పార్లమెంటు సభ్యుడి వాహనాన్ని తూతూ మంత్రంగా తనిఖీ చేసిన అధికారులపై కన్నెర్ర చేసింది ఎన్నికల సంఘం. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ మొత్తాన్ని మార్చేసింది ఈసీ. తమిళనాడులోని నీలగిరికి చెందిన డిఎంకె అభ్యర్థి ఎ రాజా వాహనాన్ని తనిఖీ చేయడంలో అలసత్వం వహించినందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలోని అధికారిని విధుల నుంచి తొలగించింది. ప్రముఖ నేతల పట్ల ఇలాంటి మెతక వైఖరి ఎన్నికల సమతూకాన్ని చెడగొడుతుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.

లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడు నీల్‌గిరీస్‌ ఎంపీ రాజా వాహనాన్ని సక్రమంగా తనిఖీ చేయకుండానే పంపిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌ హెడ్‌ గీతను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. వాహనంలో అనేక సంచులు, సూట్‌కేసులున్నా పైపైనే.. నామమాత్రంగా తనిఖీ చేసి వదిలేయడం కలకలం రేపింది. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడంలో గీత విఫలమయ్యారని ఈసీ సీరియస్‌ అయింది. గీతతో పాటు తనిఖీలు జరిపిన మొత్తం ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ను చేంజ్‌ చేసింది ఈసీ. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ హెచ్చరించింది.

మార్చి 25న కూనూర్ సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రాజా కాన్వాయ్‌ని తనిఖీ చేయడంలో అలసత్వం వహించినట్లు కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన తాలూకు ఫుటేజ్‌నంతా గమనించాక ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వాహనాలను చూసిచూడనట్లు వదిలేస్తే ఎలా అని ఈసీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. నీల్‌గిరీస్‌లో ఏప్రిల్ 19న తొలివిడతలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరపున కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌ ఈ నియోజకవర్గం నుంచి తలపడుతున్నారు. డీఎంకే తరపున రాజా పోటీపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…