చెన్నై, నవంబర్ 9: మైనర్‌తో వాహనాలు నడిపించడమే తప్పు అయితే.. ఓ వ్యక్తి ఏకంగా తన నాలుగేళ్ల బాబుకే స్టీరింగ్ చేతికి అప్పగించాడు. ఇంతలోనే కారు అదుపుతప్పింది. ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈ దానేఫ ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడితో కారు నడిపించాడు. అదీ జన సంచారం ముమ్మరంగా ఉన్న ప్రాంతంలో.. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్తున్న వృద్ధుడిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటీజే క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటి ముందున్న గెటు వద్ద మెట్లు ఎక్కుతున్న వృద్ధుడిని కారు ఢీ కొట్టడం వీడియో కనిపిస్తుంది.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలుడి తండ్రిని తిరుపత్తూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్‌తో వాహనాలు నడిపించడమే తప్పు అయితే ఏకంగా తన నాలుగేళ్ల కుమారుడికే స్టీరింగ్ అప్పగించడం మహా నేరమని, జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన వృద్ధుడిని ముత్తుగా గుర్తించారు.