ముగ్గులేశారని 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు రీజన్ ఏంటంటే..?

| Edited By:

Dec 30, 2019 | 4:16 AM

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. వివిధ రీతిలో ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేరళలోని ఓ చర్చ్‌లో క్రైస్తవులు ముస్లిం వేశధారణలో ప్రార్థనలు చేస్తూ.. వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అయితే తమిళనాడులో పౌర సత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించి.. అరెస్ట్ అయిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పౌరసత్వ సవరణ చట్టాన్ని […]

ముగ్గులేశారని 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు రీజన్ ఏంటంటే..?
Follow us on

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. వివిధ రీతిలో ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేరళలోని ఓ చర్చ్‌లో క్రైస్తవులు ముస్లిం వేశధారణలో ప్రార్థనలు చేస్తూ.. వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అయితే తమిళనాడులో పౌర సత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించి.. అరెస్ట్ అయిన ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చెన్నైలోని కొందరు ఆందోళనకారులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఎన్నార్సీ, సీఏఏని వ్యతిరేకిస్తూ ముగ్గులు వేశారు. అది కూడా ప్రధాన రహదారులపై. ఇక మరికొందరు ఇతరుల ఇంటి ముందు కూడా ముగ్గులు వేశారు. ఆ ముగ్గులో సీఏఏకి వ్యతిరేకంగా నినాదాలు కూడా రాశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… ముగ్గులు వేసిన ఏడుగిరితో పాటు.. మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే వీరిని విడిపించేందుకు వచ్చిన ఇద్దరు అడ్వకేట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కాసేపటి తర్వాత విడిచిపెట్టారు. బీసెంట్ నగర్‌లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే వారిని అరెస్ట్ చేసినట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ తెలిపారు. వారు నిరసన తెలిపేందుకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదన్నారు. అందుకే అరెస్ట్‌ చేశామన్నారు. ఇదిలా ఉంటే తమకు నిరసన తెలిపేందుకు పర్మిషన్ అడిగితే.. చెన్నై పోలీసులు నిరాకరిస్తున్నారని.. అందుకే ఇలా ముగ్గులు వేస్తూ వినూత్న రీతిలో నిరసన తెల్పినట్లు నిరసనకారులు తెలిపారు.