AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED Operation:ఈడీ సోదాల్లో భౌతిక దాడులు.. 200 మంది అధికారులను చుట్టుముట్టిన స్థానికులు..

ఈడీ సోదాలు జరగడంపై పార్టీలు రాజకీయ దాడి చేస్తుంటాయి. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఈడీ అధికారులపై భౌతిక దాడులు జరగడం కలకలం రేపింది. అటు హర్యానాలో జరిగిన ఈడీ తనిఖీల్లో బంగారంతో పాటు ఆయుధాలు కూడా బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో సరికొత్త వివాదం మొదలైంది. ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపైనే దాడి జరగడం సంచలనంగా మారింది. దాదాపు 200 మంది ఈడీ అధికారులను స్థానికులు చుట్టుముట్టారు.

ED Operation:ఈడీ సోదాల్లో భౌతిక దాడులు.. 200 మంది అధికారులను చుట్టుముట్టిన స్థానికులు..
West Bengal Ed Operations
Srikar T
|

Updated on: Jan 05, 2024 | 9:41 PM

Share

ఈడీ సోదాలు జరగడంపై పార్టీలు రాజకీయ దాడి చేస్తుంటాయి. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఈడీ అధికారులపై భౌతిక దాడులు జరగడం కలకలం రేపింది. అటు హర్యానాలో జరిగిన ఈడీ తనిఖీల్లో బంగారంతో పాటు ఆయుధాలు కూడా బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో సరికొత్త వివాదం మొదలైంది. ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపైనే దాడి జరగడం సంచలనంగా మారింది. దాదాపు 200 మంది ఈడీ అధికారులను స్థానికులు చుట్టుముట్టారు. వారి వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో ఈడీ బృందంలోని అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. రేషన్‌ కుంభకోణాన్ని దర్యాప్తు చేయడానికి ఈడీ అధికారులు, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌కాళీ ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో తృణమూల్‌ నేత షాజహాన్‌ ఇంట్లో ఈడీ తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే అంతలోనే ఈడీ అధికారులపై మూక దాడి జరిగింది.

ఈడీ అధికారులపైనే దాడులు జరగడం బెంగాల్‌లో కలకలం రేపుతోంది. ఇదొక రాజకీయ దుమారంగా మారుతోంది. తృణమూల్‌ నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనీ, వాటిపై దర్యాప్తు కోసం ఈడీ సహజంగానే వెళుతుందని బీజేపీ బెంగాల్‌ నేతలు అంటున్నారు. ఈ దాడులకు రోహింగ్యాలు కారణమని చెబుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. హర్యానాలోని యమునానగర్, సోనిపట్, ఫరీదాబాద్, కర్నాల్‌తో పాటు చండీగఢ్ పంజాజ్‌లోని మొహాలీలోనూ ఈడీ సోదాలు జరిగాయి. సోనిపట్ ఎమ్మెల్యే పన్వర్, యమునానగర్ మాజీ ఎమ్మెల్యే సింగ్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు చేపట్టింది. ఈ ఇద్దరూ మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఇద్దరు రాజకీయ నాయకులు, వారి సన్నిహితులతో సంబంధం ఉన్న 20 స్థావరాలపై దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడుల్లో భాగంగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులు, బంగారం కూడా పట్టుబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..