Rahul Gandhi – ED officials: నేషనల్ హెరాల్డ్ కేసులో.. ఐదురోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్న రాహుల్ గాంధీ, తొలిసారి విచారణపై స్పందించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో తనను అడిగిన ప్రశ్నల గురించి వివరించారు. చివరి రోజైన ఐదో రోజు ఈడీ అధికారులు తనను ఒక ప్రశ్న అడిగారని చెప్పారు. ఇన్ని రోజులు, ఇన్ని గంటల పాటు ప్రశ్నించాం కదా, అన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చారు.. ఇంత ఓపిక, సహనం మీకు ఎలా వచ్చిందని ఈడీ అధికారులు తనను ప్రశ్నించినట్టు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆ ప్రశ్నకు తాను చాలా సింపుల్‌గా ఆన్సర్ చెప్పానని పేర్కొన్నారు.
11, 12 గంటలపాటు కుర్చీలో ఎలా కూర్చోగలిగారని గత రాత్రి ఈడీ అధికారులు అడిగారని.. దానికి అసలు కారణం చెప్పకూడదని అనుకున్నా.. అందుకే ‘విపాసన’ చేస్తానని అబద్దం చెప్పా అంటూ రాహుల్ పేర్కొన్నారు. తాను 2004 నుంచి కాంగ్రెస్‌లో ఉన్నానని, కాంగ్రెస్ వారిలో ఓర్పు, సహనం సహజంగానే ఉంటాయని తాను సమాధానం చెప్పినట్టు రాహుల్ గాంధీ వివరించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో 5 రోజుల పాటు, దాదాపు 53 గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్‌ను ప్రశ్నించారు. అటు, ఈడీకి సోనియాగాంధీ లేఖ రాశారు. కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, విచారణకు హాజరయ్యేందుకు మరింత గడువు కావాలని సోనియా ఈడీని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..