Kolkata ED Raid: అమీర్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు.. మొబైల్ గేమింగ్ అప్లికేషన్ ద్వారా మోసాలు..10 ట్రంకు పెట్టెల్లో నగదు..
ED Raid: కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త అమీర్ ఖాన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దాడి చేసి 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఐదు ట్రంక్‌లలో నిల్వ చేసిన 200-500-2000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకుంది. దాని కోసం కౌంటింగ్ కోసం యంత్రాన్ని తీసుకొచ్చారు.

అక్రమ గుట్టలుకదులుతున్నాయి. తవ్విన కొద్ది బయట పడుతున్నాయి. తాజాగా బెంగల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్వహించిన దాడిలో పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అధికారులు జరిపిన సోదాల్లో రూ. 17 కోట్ల నగదును రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదును తరలించేందుకు 10 ట్రంకు పెట్టెలను ఉపయోగించారు. ఇందులో 5 ట్రంక్‌లలో రూ. 200- రూ500లరె మరో 5 ట్రంక్ పెట్టెల్లో రూ,2000 నోట్లను నింపి తరలించారు. శనివారం ఉదయం ప్రారంభమైన దర్యాప్తు సంస్థ దాడులు అదే రోజు అర్థరాత్రి వరకు సాగింది. అమీర్ ఖాన్ నివాసంలో లభించిన నగదును లెక్కింపు కోసం నోట్ల మిషిన్లు ఉపయోగించాల్సి వచ్చింది. ఈడీ బృందం వెంట బ్యాంకు అధికారులు, కేంద్ర బలగాలు ఉన్నారు. నోట్ల కట్టల్లో రూ.500 నోట్లు ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత రూ.2,000, రూ.200 నోట్లు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు.
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 నిబంధనల ప్రకారం ED రైడ్ జరిగింది. ఫెడరల్ బ్యాంక్ అధికారులు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది ఫిబ్రవరి 15న కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో అమీర్ ఖాన్, ఇతరులపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) దాఖలు చేశారు.
గేమింగ్ అప్లికేషన్ ద్వారా మోసాలు..
కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త అమీర్ ఖాన్ మొబైల్ గేమింగ్ అప్లికేషన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఇ-నగ్గెట్స్ అనే మొబైల్ గేమింగ్ అప్లికేషన్‌ను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇందులో నిజమైన మొబైల్ గేమ్స్ కాకుండా కేవలం సైబర్ మోసాలు చేసేందుకు ఈ గేమ్స్ ను ఉపయోగిస్తున్నట్లుగా తేల్చారు. ముందుగా గేమ్ గెలుచుకున్నారంటూ ఈ యాప్ ద్వారా యూజర్లకు కమీషన్ ఇస్తారు. మరింత డబ్బులు గెలుచుకునేందుకు కొంత ఆశ చూపిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా వారి వాలెట్ నుంచి మొత్తం డబ్బులను వారికి తెలియకుండానే కొట్టేస్తారు.
మొబైల్ గేమింగ్ అప్లికేషన్‌కు సంబంధించిన శనివారం తెల్లవారుజామున కేంద్ర ఏజెన్సీ కోల్‌కతాలోని ఆరు చోట్ల సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు నకిలీ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు సెర్చ్ ఆపరేషన్‌లో గుర్తించింది. వినియోగదారులను మోసం చేసి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు ఈడీ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం




