Joyalukkas: జోయ్ అలుక్కాస్‌కు భారీ షాక్‌.. హవాలా ఆరోపణలతో 305 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేసిన ఈడీ

కేరళకు చెందిన ప్రముఖ జ్యువెలరీ గ్రూప్ జోయ్ అలుక్కాస్‌కు భారీ షాక్‌ తగిలింది. జోయ్ అలుక్కాస్ పై ఈడీ దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఐదు రోజుల పాటు వరుస సోదాలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెప్పింది.

Joyalukkas: జోయ్ అలుక్కాస్‌కు భారీ షాక్‌.. హవాలా ఆరోపణలతో 305 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Joyalukkas

Updated on: Feb 25, 2023 | 6:58 AM

కేరళకు చెందిన ప్రముఖ జ్యువెలరీ గ్రూప్ జోయ్ అలుక్కాస్‌కు భారీ షాక్‌ తగిలింది. జోయ్ అలుక్కాస్ పై ఈడీ దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఐదు రోజుల పాటు వరుస సోదాలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. ఈసోదాల్లో 305.84 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది ఈడీ. అటాచ్ చేసిన ఆస్తులలో 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంకు ఖాతాలు, 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువైన జోయ్ అలుక్కాస్ షేర్లను కూడా ఈడీ సీజ్ చేసింది. హవాలా మార్గాల ద్వారా భారతదేశం నుండి దుబాయ్‌కి భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ తర్వాత 100 శాతం జాయ్ అలుక్కాస్ వర్గీస్‌కు చెందిన జోయల్లుకాస్ జ్యువెలరీ LLC, దుబాయ్‌లో పెట్టుబడి పెట్టింది. 2,300 కోట్ల ఐపీవో ఉపసంహరించుకున్న మరునాడే వరుస సోదాలు చేపట్టిన ఈడీ  అధికారులు భారీ మొత్తంలో ఆస్తులను సీజ్‌ చేశారు.

 

ఇక జోయ్ అలుక్కాస్ దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల షోరూమ్ గా కొనసాగుతుంది. జోయ్ అలుక్కాస్‌కు సంస్థకు దేశవ్యాప్తంగా 68 శాఖలున్నాయి. జ్యూయలరీ బిజినెస్‌లో దేశంలో, ముఖ్యంగా సౌత్‌ ఇండియాలో బాగా పాపులర్‌ అయింది. అయితే 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్టు కోసం దుబాయ్‌కి హవాలా రూపంలో 305 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జోయ్ అలుక్కాస్ అధినేత నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులో సోదాలు నిర్వహించింది ఈడీ అధికారులు. సోదాల సమయంలో సేకరించిన ఆధారాలు అధికారిక పత్రాలు, మెయిల్‌లు, హవాలా లావాదేవీలలో జాయ్ అలుక్కాస్ చురుకైన ప్రమేయం ‘స్పష్టంగా రుజువు చేయబడింది’

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..