పాక్‌కు మద్దతు పలికిన దేశాలకు ఊహించని షాకిచ్చిన భారతీయ కంపెనీలు!

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దేశాలకు ఈజీ మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్ వంటి భారతీయ ట్రావెల్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాక్‌కు మద్దతు పలికిన దేశాలకు ఊహించని షాకిచ్చిన భారతీయ కంపెనీలు!
Azerbaijan

Updated on: May 10, 2025 | 3:26 PM

ప్రస్తుతం భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రికత్తల గురించి తెలిసిందే. రెండు దేశాలు అనధికారిక యుద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ రెండు దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించాయి. ఆ రెండు దేశాలకు భారతీయ ట్రావెలింగ్‌ కంపెనీలు ఊచించని షాకిచ్చాయి. టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా, పాక్‌కు మద్దతు తెలపడంతో ఈజీమైట్రిప్‌(EaseMyTrip) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. పర్యాటకులు అత్యవసరమైతేనే టర్కీ, అజర్‌బైజాన్‌లను సందర్శించాలని సూచించింది. అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్, టర్కీలకు అన్ని కొత్త ప్రయాణ ఆఫర్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కాక్స్ అండ్‌ కింగ్స్ తెలిపింది.

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసి, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత పాకిస్తాన్‌కు టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు మద్దతు ఇచ్చాయి. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తత మరింత పెరగడంపై అజర్‌బైజాన్ ఆందోళనను వ్యక్తం చేస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌పై జరిగిన సైనిక దాడులను మేం ఖండిస్తున్నాం, ఇందులో అనేక మంది పౌరులు మరణించారు, గాయపడ్డారు అని అజర్‌బైజాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. “పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ, అమాయక బాధితుల కుటుంబాలకు మేం సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, దౌత్య మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని మేం కోరుతున్నాం” అని అజర్‌బైజాన్ తెలిపింది.

అలాగే టర్కీ స్పందిస్తూ.. నిన్న (మే 6) రాత్రి జరిపిన దాడి పూర్తి స్థాయి యుద్ధ ప్రమాదాన్ని పెంచుతుందని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 7న ఒక ప్రకటనలో పేర్కొంది. పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులతో పాటు ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను మేం ఖండిస్తున్నాం” అని తెలిపింది. ఇలా ఈ రెండు దేశాలు పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడటంతో ఈ రెండు దేశాలకు ట్రావెల్‌ బుకింగ్‌లో ఆఫర్స్‌ను నిలిపివేశాయి భారతీయ ట్రావెలింగ్‌ కంపెనీలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..