Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం.. వీడియో..

|

Mar 21, 2023 | 11:01 PM

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రాత్రి 10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రజలు తమ ఇళ్లు, భవనాల నుంచి బయటకు వచ్చారు.

Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం.. వీడియో..
Delhi Earthquake
Follow us on

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రాత్రి 10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రజలు తమ ఇళ్లు, భవనాల నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మీరట్, సుల్తాన్‌పూర్‌లో ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత 6.6గా నమోదైందని చెబుతున్నారు.

ఈ ప్రకంపనలు చాలా సేపు ఉన్నాయి. భూకంప కేంద్రాన్ని ఆఫ్ఘనిస్థాన్‌గా పేర్కొంటున్నారు. భారత్‌తో పాటు పాకిస్థాన్, తజికిస్థాన్, చైనాలో కూడా భూకంపం సంభవించింది. దాదాపు 45 సెకన్ల పాటు భూకంపం వచ్చినట్లు ప్రజలు తెలిపారు.