
Earthquake in Karnataka: కర్నాటక రాజధాని బెంగుళూరు, సహా పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున చిక్కబల్లపుర జిల్లా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించినట్లు కర్ణాటక విపత్తు శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించాయి. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని ఎన్సీఎస్ వెల్లడించింది.
ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలిపింది. బుధవారం ఉదయం 7.09 గంటలకు ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రం ఈశాన్య బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో భూమికి 11 కిలోమీటర్ల లోతున ఉందని చెప్పింది.
Earthquake of Magnitude:3.1, Occurred on 22-12-2021, 07:09:36 IST, Lat: 13.59 & Long: 77.73, Depth: 11 Km ,Location: 70km NNE of Bengaluru, Karnataka, India for more information download the BhooKamp App https://t.co/QwfkjFOGRX pic.twitter.com/LQ87OjGcA7
— National Center for Seismology (@NCS_Earthquake) December 22, 2021
భూ ప్రకంపనలతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన బెంగళూరు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా చిక్కబల్లపుర జిల్లాలో రెండుసార్లు ప్రకంపనలు సంభవించినట్లు విపత్తు శాఖ తెలిపింది.
Two earthquakes of magnitude 2.9 & 3.0 were recorded in Chikkaballapura District today morning, says Karnataka State Natural Disaster Monitoring Centre.
— ANI (@ANI) December 22, 2021
Also Read: