E-Shram Portal: ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి.. కార్మికులు తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలంటే..

|

Aug 26, 2021 | 5:17 PM

E-Shram: దేశ వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికుల డేటా బేస్ కోసం రూపొందించిన ఈ-శ్రమ్ పోర్టల్‌ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గురువారం ప్రారంభించారు.

E-Shram Portal: ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి.. కార్మికులు తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలంటే..
E Shram
Follow us on

E-Shram: దేశ వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికుల డేటా బేస్ కోసం రూపొందించిన ఈ-శ్రమ్ పోర్టల్‌ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గురువారం ప్రారంభించారు. న్యూఢిల్లీలోని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆయన ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ పోర్టల్ దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల డేటాబేస్‌ను నిర్వహిస్తుంది. అలాగే వారి సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఉపకరిస్తుంది. కాగా, ఈ పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి, ఈ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పాల్గొన్నారు.

ఈ-శ్రమ్ ఆవిష్కరణను ట్రేడ్ యూనియన్ నాయకులందరూ స్వాగతించారు. పోర్టల్ విజయవంతంగా ప్రారంభించడానికి, నిర్వహణకు తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. కాగా, యూనియన్ నాయకుల విలువైన, నిర్మాణాత్మక సూచనలకు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల నమోదులో వేగం, క్షేత్రస్థాయిలో కార్మికుల గుర్తింపు వంటి విషయాల్లో ట్రేడ్ యూనియన్ నాయకుల పాత్ర కీలకం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాగా, ఈ పోర్టల్‌లో అసంఘటిత రంగ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.

ఇదిలాఉంటే.. ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకు ప్రత్యేకమైన 12 అంకెల నంబర్‌తో ఈ-లేబర్ కార్డ్ ఇవ్వబడుతుంది. దీని ద్వారా ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలను సమగ్రపరచవచ్చు. అలాగే ప్రతి ప్రభుత్వ పథకం ద్వారా కార్మికులు ప్రయోజనం పొందవచ్చు. కాగా, ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు, వలస కార్మికులు, వీధి విక్రేతలు, గృహ నిర్మాణ కార్మికులు వంటి 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పోర్టల్‌లో కార్మికుల నమోదును కార్మిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు సమన్వయం చేస్తాయని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు తమ పేర్లను పోర్టల్‌లో నమోదు చేయడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

కాగా, పోర్టల్ ప్రారంభించిన నేపథ్యంలో అసంఘటిత రంగ కార్మికులు నేటి నుంచే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పుట్టిన తేదీ, స్వస్థలం, మొబైల్ నంబర్, సామాజిక వర్గం వంటి ఇతర అవసరమైన వివరాలను పూరించడమే కాకుండా, కార్మికుడు తన ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే.. నివృత్తి చేసుకునేందుకు జాతీయ స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 14434 ని కూడా ప్రారంభించారు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…

What Do Girls Like In Boys: ఒక అమ్మాయి ఈ సంకేతాలు ఇస్తే అబ్బాయి స్నేహాన్ని, ప్రేమని ఇష్టపడుతుందని అర్ధమట

Punjab Congress: పంజాబ్ కాంగ్రెస్‌లో లుకలుకలు.. సీఎం మార్పుకు నలుగురు మంత్రుల డిమాండ్.. ఏం జరుగుతుందంటే?