మైసూరు గ్యాంగ్ రేప్ కేసు.. కర్ణాటక హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్య..ఏమన్నారంటే ..?

మైసూరు గ్యాంగ్ రేప్ కేసు ఘటనపై కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైంది. మైసూరు నగర శివారుకు తన స్నేహితుడితో ఈ మెడికల్ స్టూడెంట్ రాత్రి 7 గంటలకు వెళ్లడమేమిటని ఆయన అన్నారు.

మైసూరు గ్యాంగ్ రేప్ కేసు.. కర్ణాటక హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్య..ఏమన్నారంటే ..?
Karnataka Home Minister Araga Jnanendra Controversial Remark
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2021 | 6:33 PM

మైసూరు గ్యాంగ్ రేప్ కేసు ఘటనపై కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైంది. మైసూరు నగర శివారుకు తన స్నేహితుడితో ఈ మెడికల్ స్టూడెంట్ రాత్రి 7 గంటలకు వెళ్లడమేమిటని ఆయన అన్నారు. ఆ సమయంలో ఆమె అక్కడ ఏం చేస్తోందన్నారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడానికి చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ తనను ‘రేప్’ చేయడానికి యత్నిస్తోందన్నారు. ఏమైనా ఇది అమానుష ఘటన అని..ఆమె..ఆమె స్నేహితుడు నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లకుండా ఉండవలసిందని ఆయన అన్నారు. బీజేపీకే చెందిన మరో నేత ఎస్.ప్రకాష్ .. ఈ మంత్రి వ్యాఖ్యను సున్నితంగా విమర్శించారు.. ఏ అత్యాచార ఘటన ఆంయినా సెన్సిటివ్ అని, ఎవరైనా ఈ విధమైన ఘటనల పట్ల బాధ్యతాయుతంగా స్పందించాల్సి ఉంటుందని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందన్నారు. అటు హోమ్ మంత్రి వ్యాఖ్యపై మండిపడిన కాంగ్రెస్ నేత బ్రిజేష్ కాలప్ప.. ఈ ఘటన తాలూకు పరిస్థితిని ఆయన ట్విస్ట్ చేయజూస్తున్నారని, తేలిగ్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు.

ఆయన రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదన్నారు. కాగా బాధిత యువతి మహారాష్ట్రకు చెందినదని, మైసూరులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుతోందని తెలిసింది. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ యువతి ఇంకా షాక్ లో ఉందని, ఏమీ చెప్పలేకపోతోందని సమాచారం. మైసూరు లోని తిప్పయానకెరె ప్రాంతంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈమె స్నేహితుని నుంచి స్టేట్ మెంట్ ను సేకరించామన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: తాలిబన్లు శవాలను కూడా రేప్ చేస్తారు… సంచలన విషయాలు తెలిపిన అఫ్ఘన్‌ మహిళ..:Taliban Rape Corpses Video.

ఈ స్కూటర్‌ ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కి.మీ. వరకు మీ ఇష్టం..యూ గో ఎలక్ట్రికల్ స్కూటర్ :U-GO Electrical Scooter video.

సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.

ఆగిపోయే పెళ్లిని నెటిజన్స్‌ అండతో పేదింటి అమ్మాయికి ఘనంగా పెళ్లి..:Netizes‌ Support For Poor Girl Video.