మోదీని తిట్టినోడికి బిజెపి పెద్దపీట..ఇదేం చిత్రమో కదా ?

|

Oct 26, 2019 | 2:01 PM

వారం క్రితం వరకూ ప్రదాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నాయకుడిపుడు బిజెపి ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకుంటున్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది ? ఎస్.. ఇక్కడ ప్రస్తావిస్తున్నది హర్యానాలో సడన్‌గా కింగ్ మేకర్‌గా మారిన జెజెపి అధినేత దుశ్యంత్ చౌతాలా గురించే. ఆయన మోదీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఒకటి తాజా పరిణామాల నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. హర్యానా ఎన్నికల […]

మోదీని తిట్టినోడికి బిజెపి పెద్దపీట..ఇదేం చిత్రమో కదా ?
Follow us on

వారం క్రితం వరకూ ప్రదాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నాయకుడిపుడు బిజెపి ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకుంటున్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది ? ఎస్.. ఇక్కడ ప్రస్తావిస్తున్నది హర్యానాలో సడన్‌గా కింగ్ మేకర్‌గా మారిన జెజెపి అధినేత దుశ్యంత్ చౌతాలా గురించే. ఆయన మోదీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఒకటి తాజా పరిణామాల నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది.

హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ.. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన దాడులను ప్రస్తావించారు. ఇది నచ్చని జెజెపి అధినేత దుశ్యంత్ చౌతాలా ప్రచార సభల్లో మోదీకి వ్యతిరేకంగా చెలరేగడమే  కాకుండా.. తాను ప్రచార పర్వంలో ప్రయాణిస్తున్న సమయంలో రికార్డు చేసిన పలు వీడియోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో భాగంగా పోస్ట్ చేసిన వీడియో ఇది.

తాజాగా హర్యానా ఫలితాల్లో ఏ పార్టీకి సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసే స్థాయిలో సీట్లు రాకపోవడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. మొత్తం 90 మంది శాసనసభ్యులున్న హర్యానా అసెంబ్లీలో 46 సీట్లు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ వుంది. కానీ.. అధికారంలో వుండి ఎన్నికలను ఎదుర్కొన్న బిజెపి.. 40 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 31 సీట్ల దగ్గర ఆగిపోగా.. గత డిసెంబర్ నెలలోనే ఏర్పాటైన జెజెపి అనూహ్యంగా 11 సీట్లను గెలుచుకుంది. ఇండిపెండెంట్లు కూడా భారీగానే విజయం సాధించారు.

అయితే.. ఇండిపెండెంట్లను ముందుగానే దారిలోకి తెచ్చుకున్న బిజెపి.. ప్రభుత్వం కాస్త బలంగా, పటిష్టంగా వుండాలంటే ఒక పార్టీగా మద్దతు తీసుకుంటే బావుంటుందన్న వ్యూహంతో జెజెపి లైన్ వేశారు బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా. అందులో భాగంగానే జెజెపి అధినేత దుశ్యంత్ చౌతాలాకు హర్యానా డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసి, ఆయన నుంచి సానుకూలం ఫలితం రాబట్టారు. మరో అడుగు ముందుకే జెజెపిని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని కూడా ఆహ్వానించారు.

దాంతో ఎన్నికల ప్రచారంలో మోదీని తెగ తిట్టిపోసిన దుశ్యంత్ చౌతాలాతోపాటు ఆయన పార్టీ నేతలిపుడు ఎన్డీయేలో భాగస్తులు కాబోతున్నారు. సో.. పాలిటిక్స్ అంటే ఇంతేనేమో.. ఎప్పుడు ప్రత్యర్థులో.. ఇంకెప్పుడు మిత్రులో.. తెలుసుకోవడం కష్టం. తాజా పరిణామాల నేపథ్యంలో నెటజన్లు చేస్తున్న కామెంట్లు రాజకీయ నేతలకు ఇబ్బందికరంగా మారాయనడంలో సందేహం లేదు.