Leech Therapy : జలగలతో బ్లాక్ ఫంగస్‌కి మందు..! వైద్యులు వీటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసా..?

Leech Therapy : దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఈ వ్యాధి

Leech Therapy : జలగలతో బ్లాక్ ఫంగస్‌కి మందు..! వైద్యులు వీటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసా..?
Leech

Updated on: May 21, 2021 | 5:44 PM

Leech Therapy : దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే వైద్యులు బ్లాక్ ఫంగస్‌కు చికిత్స చేయడానికి విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నారు. దీని గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం. బ్లాక్ ఫంగస్‌కి చికిత్స చేయడానికి వైద్యులు రక్తం పీల్చే జలగల కోసం చూస్తున్నారని తెలిసింది. ఇది నిజమా కాదా తెలుసుకుందాం.

వాస్తవానికి కరోనా వైరస్ తరువాత బ్లాక్ ఫంగస్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఆయుర్వేద పద్ధతి ద్వారా ఈ వ్యాధిని నయం చేయడానికి వైద్యలు జలగల కోసం చూస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నా రాష్ట్ర ఆయుర్వేద కళాశాలలో విషం లేని జలగల కోసం అన్వేషణ జరగుతుందని తెలిసింది. రోగులకు దీనితో చికిత్స చేయవచ్చు. నివేదిక ప్రకారం.. జలగ మానవ శరీరం నుంచి చెడు రక్తాన్ని పీలుస్తుంది. చనిపోయిన కణాన్ని నాశనం చేస్తుంది. రక్త ప్రసరణ ఆగి చర్మం క్షీణించినప్పుడు చనిపోయిన కణాలను సక్రియం చేయడానికి జలగ చాలా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అందువల్ల వైద్యులు చికిత్స కోసం జలగలను వెతుకుతున్నారు.

జలగలో రెండు రకాలు..
జలగలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి విషంతో, మరొకటి విషం లేకుండా. విషంలేని జలగను గుర్తించడం చాలా సులభం. కానీ విషంతో ఉన్న జలగలు ముదురు నలుపు రంగులో ఉంటాయి. అదే సమయంలో విషం లేని జలగ మృదువైన చర్మం, జుట్టులేకుండా ఆకుపచ్చగా ఉంటుంది. విషం లేని జలగలు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. విశేషమేమిటంటే ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం బ్లాక్జాక్ ఇంజెక్షన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది.

Tv9

Viral Video : పాకిస్తాన్‌లో పిల్లలపై దాడి చేసిన సింహం..! క్రూర జంతువని తెలిసి అలా చేశారు.. వైరల్‌గా మారిన వీడియో..

Covid-19 Vaccine : కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..! వ్యాక్సిన్ వేసుకున్న ఫొటో పంపండి.. 5 వేలు గెలుచుకోండి..!

Tollywood News: కెరీర్‌ను ప‌క్క‌గా ప్లాన్ చేస్తోన్న రౌడీ హీరో..! సోనూ హీరోగా ఆ స్టార్ డైరెక్ట‌ర్ సినిమా !