AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood News: కెరీర్‌ను ప‌క్క‌గా ప్లాన్ చేస్తోన్న రౌడీ హీరో..! సోనూ హీరోగా ఆ స్టార్ డైరెక్ట‌ర్ సినిమా !

లాక్‌ డౌన్‌ దెబ్బకు లాంగ్ గ్యాప్ రావటంతో నెక్ట్స్ గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు విజయ్‌ దేవరకొండ. అందుకే లైగర్ తరువాత బ్రేక్‌ రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Tollywood News:  కెరీర్‌ను ప‌క్క‌గా ప్లాన్ చేస్తోన్న రౌడీ హీరో..! సోనూ హీరోగా ఆ స్టార్ డైరెక్ట‌ర్ సినిమా !
Vijay Sonu
Ram Naramaneni
|

Updated on: May 21, 2021 | 4:07 PM

Share

లాక్‌ డౌన్‌ దెబ్బకు లాంగ్ గ్యాప్ రావటంతో నెక్ట్స్ గ్యాప్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు విజయ్‌ దేవరకొండ. అందుకే లైగర్ తరువాత బ్రేక్‌ రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే లైగర్ తరువాత సుకుమార్‌తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు రౌడీ హీరో. కానీ ఆ సినిమా వెంటనే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపించటం లేదు.  పుష్ప సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తుండటంతో షూటింగ్‌కు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. అందుకే సుకుమార్ ఫ్రీ అయ్యేలోగా మరో సినిమాను పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నారు విజయ్ దేవరకొండ. నిన్నుకోరి, మజిలి లాంటి హార్ట్ టచింగ్ సినిమాలు చేసిన శివ నిర్వాణ దర్శకత్వంలో మూవీకి రెడీ అవుతున్నారు. సుకుమార్ సినిమా కన్నా ముందే శివా సినిమాను పూర్తి చేయాలన్నది విజయ్ దేవరకొండ ప్లాన్‌. అలా చేస్తే లైగర్‌కు సుకుమార్ సినిమాకు మధ్య ఉన్న గ్యాప్ కవర్‌ అవుతుందన్న మాట. మరి ఈ ప్లానింగ్‌కు శివ నిర్వాణ ప్రీపేర్డ్‌గానే ఉన్నారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

సోనూ హీరోగా క్రిష్ సినిమా!

తెర మీద విలన్ క్యారెక్టర్స్ చేసే సోనూసూద్.. రియల్ లైఫ్ మాత్రం సూపర్ హీరోగా మారిపోయారు. కరోనా కష్టకాలంలో వేలాది మందికి సాయం చేసిన సోనూ.. సేవియర్‌గా మారారు. దీంతో తెర మీద సోనూను విలన్‌గా చూపించేందుకు భయపడుతున్నారు మేకర్స్‌. మరికొంత మంది సోనూ సోలో హీరోగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఓ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్‌ కూడా ఉన్నారట. సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో సినిమాలు చేసిన క్రిష్… సోనూ సూద్‌ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్‌. మణికర్ణిక టైం నుంచే క్రిష్, సోనూల మధ్య మంచి రిలేషన్‌ ఉంది. ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకోగానే సోనూ కూడా సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ మేసేజ్‌ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమా రాబోతోంది అన్నది నార్త్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.  మరో స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కూడా సోనూ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారట.. మహేష్‌తో చేయాలనుకున్న జనగణమన సినిమాను సోనూ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట పూరి. ఈ కండల వీరుడిని తెలుగు తెరకు పరిచయం చేసిన పూరి… ఇప్పుడు కమర్షియల్ హీరోగా రీ లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారన్నది లేటెస్ట్ హాట్ న్యూస్‌.

Also Read: “ఎవ‌రేమ‌నుకున్నా.. నేను ఇలాగే ఉంటా… నాలాగే ఉంటా..”

రామారావు బ‌ర్త్ డే.. సోష‌ల్ మీడియాలో మోత మోగించిన ఫ్యాన్స్…

Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..