ఎవరో వస్తారని.. ఎదో చేస్తారని ఎదురుచూడలేదు.. చేయి చేయి కలిపారు.. అద్భుతం చేశారు. ప్రాణాలకు తెగించి మరో రెండు ప్రాణాలు కాపాడారు. తమిళనాడులోని అనైవారి జలపాతాల వద్ద ఆకస్మిక వరదలో చిక్కుకున్న ఒక మహిళతోపాటు ఓ చిన్నారిని రక్షించారు స్థానిక గ్రామస్థులు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రాణాలను పణంగా పెట్టి ఆ గ్రామస్థులు చేసిన సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
కోవిడ్ ఆంక్షలు ఎత్తివేడయంతోపాటు వరుస సెలవులు రావడంతో జనం పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్రదేశాలకు చేరుతున్నారు. దీంతో తమిళనాడులోని అనైవారి జలపాతానికి భారీ టూరిస్టులు పోటెత్తారు. ఇలా అక్కడి పచ్చని ప్రకృతి, జలపాత హోయలను చూసేందుకు వచ్చిన ఓ మహిళ తన బిడ్డతోపాటు అక్కడి ప్రవాహంలో చిక్కుకుంది.
పర్యాటకులు చూస్తుండగానే జలపాతం ఉగ్రరూపం దాల్చింది. అప్పటి వరకు జలపాతంలో నీటితో ఆడుకుంటున్న జనం పరుగులు పెట్టారు. అయితే అటువైపు ఓ బండ రాయిపై కూర్చుని చూస్తున్న ఆ మహిళ అక్కడి ఉండిపోయింది. జనం అంతా ఓ వైపు మధ్యలో జల ప్రవాహం.. క్షణ.. క్షణం పెరుగుతున్న జల ప్రవాహం.. ఇది గమనించినవారు ఆమెను రక్షించేందుకు పెద్ద ఎత్తున కేకలు పెట్టారు.
దీంతో స్థానికులు ప్రాణాలకు తెగించి ఆ మహిళను రక్షించేందుకు రెడీ అయ్యారు. చిక్కుకున్నఆ ఇద్దరిని రక్షించడానికి కొంతమంది గ్రామస్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అందరి నడుములకు ఉన్న బెల్టులను ఓ తాడుగా మార్చారు. వాటి సహాయంతో ఆ ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
జల ప్రవాహంలో చిక్కుకున్న ఆ ఇద్దరిని ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయాత్నంలో ఓ ఇద్దరు గ్రామస్థులు కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయారు. కానీ, వారు సమీపంలోని ఒడ్డుకు ఈదుకుంటూ సమీపంలోని ఒడ్డుకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అనైవారి జలపాతాలు ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఆదివారం జరిగిన ఈ ఘటనతో అధికారులు జలపాత వద్ద తాత్కాలికంగా నిషేధం విధించారు. అయితే ఆ గ్రామస్థులు చూపిన దైర్యాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసించారు.
தாயையும் சேயையும் காப்பாற்றியவர்களின் தீரமிக்க செயல் பாராட்டுக்குரியது; அரசால் சிறப்பிக்கப்படுவார்கள்.
தன்னுயிர் பாராது பிறரது உயிர் காக்க துணிந்த அவர்களது தீரத்தில் மனிதநேயமே ஒளிர்கிறது!
பேரிடர்களின்போது பொதுமக்கள் கவனமுடன் இருக்க வேண்டும்.
பண்புடையார்ப் பட்டுண்டு உலகம்! pic.twitter.com/NRCb8OE8l3
— M.K.Stalin (@mkstalin) October 26, 2021
ఇవి కూడా చదవండి: Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్