
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులు, మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో రక్షణ రంగంలో ఆవిష్కరణలు, సహకారం యొక్క పాత పద్ధతులు సరిపోవని జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ సీఈవో డాక్టర్ వివేక్ లాల్ స్పష్టం చేశారు. జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. రక్షణ ఆవిష్కరణల భవిష్యత్తుపై తన దార్శనికతను పంచుకున్నారు. ఆయన ప్రపంచంలోనే టాప్ స్పేస్ అండ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌లలో ఒకరు.
భౌగోళిక రాజకీయ దృశ్యం మారుతోందని లాల్ అన్నారు. టెర్రరిస్టు గ్రూప్‌ల లాంటివాటి నుండి ఊహించని ముప్పులు వస్తున్నాయని.. స్పేస్, సైబర్ స్పేస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వంటివన్నీ ఇప్పుడు యుద్ధభూములుగా మారాయని చెప్పారు. పాత సహకారం కాదు, భద్రత, స్థిరత్వం, స్కేలబిలిటీ అనే మూడు పిల్లర్స్ కలిసిన కొత్త ప్లాన్ కావాలని నొక్కి చెప్పారు.
డాక్టర్ లాల్ దృష్టిలో భద్రత అన్నింటికీ పునాదిగా ఉండాలి. కేవలం ఆయుధాలు, ప్లాట్‌ఫామ్స్ కాదు.. మన రక్షణను స్వీయ-రక్షణ నెట్‌వర్క్‌లుగా మార్చాలి అని సూచించారు. అంటే ముప్పును త్వరగా గుర్తించి, ఆటోమేటిక్‌గా రిపేర్ చేసుకునే సిస్టమ్స్ కావాలి. చిప్ డిజైన్, కమ్యూనికేషన్స్, తయారీ అన్నింటిలోనూ బేసిక్ లెవల్ నుంచే సెక్యూరిటీని బిల్డ్ చేయాలి. టెక్నాలజీ ఒక్కటే చాలదు.. పొలిటికల్ సపోర్ట్, టీమ్ వర్క్ కూడా ఉండాలి.
రక్షణ అంటే విధ్వంసం కాదని.. స్థిరత్వం కూడా ఉండాలని లాల్ అన్నారు. ముప్పులు బోర్డర్‌ను పట్టించుకోవు. అందుకే, అన్ని దేశాలు కలిసి, ఒకరిపై ఒకరు నమ్మకంతో పనిచేయాలి. “ఏ దేశం కూడా ఒంటరిగా ఉండకూడదు” అని అన్నారు. “పచ్చదనం – రక్షణ కలిసి ఉండగలవా? అనే ప్రశ్నకు ఆయన ఉండాలి అని బలంగా సమాధానమిచ్చారు.
లాజిస్టికల్ లోపాలు, వ్యర్థాలను తగ్గించే రేడియేషన్ తట్టుకునే ఉపగ్రహ డిజైన్‌లపై పనిచేయడం ద్వారా వనరుల స్థిరత్వాన్ని సాధించవచ్చని డాక్టర్ లాల్ తెలిపారు. ఈ సమ్మిట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ రక్షణ వ్యూహాలపై కొత్త ఆలోచనలకు నాంది పలికాయి.