AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dr Jagannath Nayak: డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం.

భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ)లో కీలక నియామకం చోటుచేసుకుంది. డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథ్ నాయక్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. పదవీ విరమణ చేసిన యు. రాజా బాబు స్థానంలో నియమితులైన ఈయన, బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS) డైరెక్టర్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ విధులు నిర్వహిస్తున్నారు.

Dr Jagannath Nayak: డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం.
Drdo New Dg
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 30, 2026 | 7:44 PM

Share

భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథ్ నాయక్‌ను  నియమితులయయారు. రక్షణ పరిశోధన రంగంలో 35 ఏళ్లకు పైగా విశేష అనుభవం కలిగిన డాక్టర్ జగన్నాథ్ నాయక్, దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే అనేక కీలక ప్రాజెక్టుల్లో తన ముద్ర వేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (Directed Energy Weapon) వ్యవస్థ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఆకాశ్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన ఫైబర్ ఆప్టిక్ గైరో గైడెన్స్ టెక్నాలజీ, ఆధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థల అభివృద్ధిలోనూ ఆయన చేసిన సేవలు విశేష గుర్తింపు పొందాయి.

పరిశోధన రంగంలోనూ డాక్టర్ జగన్నాథ్ నాయక్ విశిష్ట కృషి చేశారు. ఆయన 125కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు పలు సాంకేతిక పుస్తకాలను రచించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆర్యభట అవార్డు సహా అనేక జాతీయ పురస్కారాలను అందుకున్నారు. భారత రక్షణ పరిశోధన రంగంలో అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరుపొందిన డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం డీఆర్‌డీఓకు మరింత బలాన్ని చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డాక్టర్ జగన్నాథ్ నాయక్ నాయకత్వంలో డీఆర్‌డీఓలోని క్షిపణి, వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థల అభివృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఆయన అనుభవం దోహదపడనుంది. భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, లేజర్ ఆధారిత ఆయుధాలు, డ్రోన్ నిరోధక సాంకేతికత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

డీఆర్‌డీఓలో శాస్త్రవేత్తగా ప్రారంభమైన డాక్టర్ జగన్నాథ్ నాయక్ ప్రయాణం అత్యున్నత స్థాయి డైరెక్టర్ జనరల్ పదవి వరకు చేరుకోవడం యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, వ్యూహాత్మక రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో ఆయన సాధించిన విజయాలు దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. కీలక సమయంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో భారత రక్షణ పరిశోధన రంగంలో కొత్త ఆవిష్కరణలకు ఊతం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us