Chardham Yatra 2024: చార్‌ధామ్ భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న బద్రినాథ్‌ ఆలయ తలుపులు.. ఇదిగో ఆ అద్భుత దృశ్యం

|

May 12, 2024 | 11:26 AM

మరోవైపు చార్‌ ధామ్‌ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్రవారం నాడే తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్‌ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరిచారు.

Chardham Yatra 2024: చార్‌ధామ్ భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న బద్రినాథ్‌ ఆలయ తలుపులు.. ఇదిగో ఆ అద్భుత దృశ్యం
Badrinath Temple
Follow us on

Badrinath Temple: హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఛార్‌థామ్ యాత్రను చేయాలని కోరుకుంటారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రినాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో బద్రినాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు బద్రినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భూ వైకుంఠంగా పిలిచే బద్రీనాథ్ ధామ్ తలుపులు మే 12 ఆదివారం ఉదయం ఆచార వ్యవహారాలతో భక్తుల కోసం తెరిచారు. చినుకులతో కూడిన వర్షం కురుస్తుండగా, ఆలయ తలుపులు తెరుచుకోగా, భక్తుల ఉత్సాహం, విశ్వాసం ఉప్పొంగింది. ఆలయ తలుపులు తెరవగానే జై ‘బద్రీ విశాల్ లాల్ కీ జై’ అంటూ నినాదాలతో ధామ్ ప్రతిధ్వనించింది.భారత సైన్యంలోని గ్రెనేడియర్‌ రెజిమెంట్‌ బ్యాండ్‌ భక్తి గీతాలను ఆలపించింది. ఆలయ ద్వారాలు తెరిచే సందర్భంగా ప్రత్యేక పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి బద్రినాథ్‌ ఆలయం. ఏటా శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాన్ని చార్‌ ధామ్‌ యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి ఓపెన్‌ చేస్తారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 6గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. తలుపులు తెరిచే సందర్భంగా దాదాపు పది వేల మంది భక్తులు ధామ్‌కు చేరుకున్నారు. ధామ్ చేరుకోవడానికి దారిలో ఇంకా చాలా క్యూ లైన్‌ ఉంది. అటువంటి పరిస్థితిలో, అఖండ జ్యోతి దర్శనం కోసం దాదాపు 20 వేల మంది యాత్రికులు సాయంత్రం నాటికి బద్రీనాథ్ చేరుకుంటారని భావిస్తున్నారు.

మరోవైపు చార్‌ ధామ్‌ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్రవారం నాడే తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్‌ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..