Nirmala Sitharaman: ఉచిత హామీలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. ఫ్రీ స్కీమ్స్ ఇవ్వాలంటే ఏం చేయ్యాలో చెప్పిన కేంద్రమంత్రి..

|

Aug 26, 2022 | 10:38 PM

ఉచిత హామీలు అమలు చేయడం ప్రభుత్వాలకు భారం కావడం, తద్వారా రుణాల పరిమితిని పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతుండటంతో ఇటీవల కాలంలో..

Nirmala Sitharaman: ఉచిత హామీలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. ఫ్రీ స్కీమ్స్ ఇవ్వాలంటే ఏం చేయ్యాలో చెప్పిన కేంద్రమంత్రి..
Finance Minister Nirmala Si
Follow us on

Nirmala Sitharaman: ఉచిత హామీలు అమలు చేయడం ప్రభుత్వాలకు భారం కావడం, తద్వారా రుణాల పరిమితిని పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతుండటంతో ఇటీవల కాలంలో ఈఉచిత హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇదే అంశంపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో ఉచిత హామీలు మంచివి కావంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్పందిచిన వేళ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ఉచిత హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఒకవేళ ఉచిత హామీలు ఇస్తే.. అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని సూచించారు. ఉచిత విద్యుత్తు హామీపై స్పందిస్తూ..  రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత విద్యుత్‌ హామీల వల్ల డిస్కమ్‌లు, జన్‌కోలపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు.

ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చి ఉంటే.. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ అయి ఉంటే, అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు బడ్జెట్‌ లో నిధులు కేటాయింపులు చేయాలని, ఆ బాధ్యత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపార్టీపై ఉంటుందని చెప్పారు. విద్యుత్‌ రంగాన్నే తీసుకుంటే కొన్ని పార్టీలు ఉచిత విద్యుత్‌ పేరుతో డిస్కమ్‌, జన్‌కోలపై భారం మోపుతున్నాయని.. దీనివల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. డిస్కమ్‌లు ఎన్నికల్లో ఓట్లు అడగవని.. అలాంటి సమయంలో ఆ భారాన్ని అవెందుకు మోయాలని ప్రశ్నించారు. ఇక్కడ చర్చ ఉచితాల గురించి కాదని.. ఏదైనా హామీ ఇచ్చి ఉంటే దానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇదే సమయంలో దేశంలో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 7.4 శాతం మేర వృద్ధి సాధిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది కూడా అదే స్థాయిలో వృద్ధి కనబరుస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. వచ్చే రెండేళ్ల కాలంలో భారత్‌ వేగంగా వృద్ధి సాధిస్తుందని IMF, ప్రపంచ బ్యాంక్‌ సైతం పేర్కొన్నాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి