AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Gate: శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?

త్వరలోనే దేశంలోని అన్ని టోల్‌ ప్లాజాలను మూసివేయనున్నట్లు  కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇంతకీ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటే ఏంటి.? అసలు ఇది ఎలా పనిచేస్తుంది.? ఈ విధానంలో డబ్బులు ఎలా కట్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Toll Gate: శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?
Satellite Toll System
Narender Vaitla
|

Updated on: Jul 28, 2024 | 8:31 AM

Share

హైవేలపై ప్రయాణించాలంటే కచ్చితంగా టోల్‌ చెల్లించాల్సిందే. ఇందుకోసం లైన్‌లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకప్పుడు డబ్బులు చెల్లించే విధానం నుంచి నేడు ఫాస్ట్‌ట్రాక్‌కి అప్‌గ్రేడ్‌ అవుతూ వచ్చాము. అయితే ఇకపై అసలు టోల్‌ ఫ్లాజాలే ఉండవు. అదేంటి టోల్ ఫ్లాజాలు లేకపోతే టోల్‌ ఎలా వసూలు చేస్తారనే సందేహం కచ్చితంగా వస్తుంది కదూ! దేశంలో శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. అసలు ఎలాంటి టోల్‌ ఫ్లాజాలు లేకుండానే వాహనదారుల బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు టోల్‌ రూపంలో కట్ అవుతాయి.

త్వరలోనే దేశంలోని అన్ని టోల్‌ ప్లాజాలను మూసివేయనున్నట్లు  కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇంతకీ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటే ఏంటి.? అసలు ఇది ఎలా పనిచేస్తుంది.? ఈ విధానంలో డబ్బులు ఎలా కట్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం టోల్‌ చెల్లించాలంటే వాహనదారులు టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు నిలిపి లైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌లో, కారులో ఇన్‌స్టాల్ చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా టోల్‌ కట్ అవుతుంది. శాటిలైట్‌ ఆటోమేటిక్‌గా కారు ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తుంది. దీని ఆధారంగా ఎంత టోల్‌ కట్‌ అవ్వాలో అంత ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. ఈ వ్యవస్థను శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ లేదా GPS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటారు.

శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ కారులో ఇన్‌స్టాల్ చేసిన ఆన్‌ బోర్డ్‌ యూనిట్ సహాయంతో పనిచేస్తుంది. దీని సహాయంతో ఉపగ్రహం మీరు ప్రయాణిచిన దూరాన్ని ట్రాక్‌ చేస్తుంది. హైవేలపై ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా వాహన సమాచారం ఉపగ్రహానికి అందుతుంది. ఆన్‌ బోర్డ్‌ యూనిట్‌తో లింక్‌ చేసిన వాలెట్‌లో ఉండే డబ్బులు టోల్‌ రూపంలో కట్ అవుతాయి. ఆన్‌బోర్డ్ యూనిట్‌ను వాహనదారులు తమ వాహనాల్లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే వాహనాల్లో ఈ వ్యవస్థ ఇన్‌బిల్ట్‌గా వచ్చే అవకాశం ఉంది.

జీపీఎస్‌ ఆధారంగా టోల్‌ వసూలు చేసే ఈ విధానం ప్రపంచంలోనే మొదటిదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ వసూలు విధానం అమలులోకి రావడంతో డ్రైవర్లు టోల్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల హైవేపై ట్రాఫిక్‌ జామ్ జరగదు, దీంతో సమయం వృథా అవ్వదు. ఈ విధానంతో ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి