పార్లమెంటు భవనంకు వచ్చిన ఐదేళ్ల బాలిక ప్రధాని నరేంద్ర మోదీని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ప్రధాని అడిగిన ప్రశ్నలకు ఆ చిన్నారి ఇచ్చిన సమాధానాలు అందరిలో నవ్వులు పూయించాయి. ఈ సమయంలో ప్రధాని మోదీ అమ్మాయిని ఈ ప్రశ్న వేశారు.” నేను ఎవరో నీకు తెలుసా..? అని అడిగారు. దీనికి ‘మీరు మోదీ జీ’ అని చెప్పింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా పార్లమెంటులో ప్రధానిని కలిసేందుకు తన కుటుంబాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ఐదేళ్ల కుమార్తె అహనా ఫిరోజియాను ప్రధాని నరేంద్ర మోదీకి పరిచాయం చేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సరదాగా ఆ చిన్నారితో మాట్లాడారు. తానెవరో తెలుసా..? అని చిన్నారిని ప్రశ్నించగా ‘మీరు మోదీ జీ.. ప్రతిరోజూ టీవీలో వస్తారు’ అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత తానేం చేస్తానో తెలుసా? అని ప్రధాని మోదీ అడగ్గా..”మీరు లోక్‌సభలో పనిచేస్తారు..” అని చిన్నారి ముద్దుముద్దుగా చాలా హుషారుగా సమాధానమిచ్చింది. దీంతో ప్రధానితో పాటు అక్కడున్న వారు సరదాగా నవ్వుకున్నారు. అప్పుడు ప్రధాని మోదీ ఆ అమ్మాయిని ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లనివ్వకుండా చాక్లెట్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను బీజేపీ ఎంపీ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.
తన జీవితంలో ఈ రోజును మరచిపోలేనని ట్వీట్ చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు, దేశానికి అత్యంత గౌరవనీయమైన ప్రధానమంత్రిని మా కుటుంబం కలుసుకునే అవకాశం లభించింది. ఆయన ఆశీస్సులను మా కుటుంబం అందుకుంది. తన జీవితమంతా దేశం కోసం అంకితం చేసి కష్టపడి, నిజాయితీగా, నిస్వార్థంగా, త్యాగశీలి అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి సమక్షంలో నేను కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ రోజు నా కూతురు, చిన్న అమ్మాయి అహానా,పెద్ద అమ్మాయి ప్రియాంషి ఇద్దరూ గౌరవనీయులైన ప్రధానమంత్రిని నేరుగా కలుసుకుని, ఆయన ఆప్యాయతను పొందడం పట్ల చాలా సంతోషంగా.. ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
आज का दिन अविस्मरणीय है।
विश्व के सर्वाधिक लोकप्रिय नेता, देश के यशस्वी प्रधानमंत्री, परम आदरणीय श्री @narendramodi जी से आज सपरिवार मिलने का सौभाग्य मिला, उनका आशीर्वाद और जनता की नि:स्वार्थ सेवा का मंत्र प्राप्त हुआ। pic.twitter.com/FYHY2SqgSp— Anil Firojiya (@bjpanilfirojiya) July 27, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..